Breaking News

అరవింద్‌... కొత్త చాంపియన్‌

Published on Sun, 03/09/2025 - 04:29

న్యూఢిల్లీ: భారత చదరంగంలో నేటితరం సంచలన విజేతలతో పోల్చుకుంటే అరవింద్‌ చిదంబరం ఆలస్యంగా వికసించిన చాంపియన్‌. ఇప్పటికే టీనేజ్‌లోనే దొమ్మరాజు గుకేశ్, ఆర్‌.ప్రజ్ఞానంద, అర్జున్‌ ఇరిగేశి అంతర్జాతీయ చెస్‌ టోర్నీలు, ఎలో రేటింగ్స్‌లో సత్తా చాటుకున్నారు. కానీ 64 గడుల బరిలో అరవింద్‌ 25 ఏళ్ల వయసులో వార్తల్లోకెక్కాడు. 

ప్రాగ్‌ మాస్టర్స్‌ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా భారత్‌లో కొత్త చదరంగ చక్రవర్తిగా అవతరించాడు. వయసు రీత్యా అతను లేటే కావొచ్చు... కానీ లేటెస్ట్‌ చాంపియన్‌గా భారత క్రీడాఖ్యాతిని పెంచాడు. గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్‌లతో కలిసి ఇప్పుడు నాలుగో స్తంభమయ్యాడు. 

విజేతగా మలచిన తల్లి 
మధురైలో పుట్టిన అరవింద్‌ పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల వయసులోనే కన్నతండ్రి లోకాన్ని వీడితే... కన్నతల్లే అన్నీ తానై పెంచింది. జీవితబీమా (ఎల్‌ఐసీ) ఏజెంట్‌గా పనిచేస్తూ మదురై నుంచి చెన్నైకి మారి బతుకుబండిని లాగించింది. ఏడేళ్ల వయసులో తాత చెస్‌లో ఓనమాలు నేర్పితే అందులోనే కెరీర్‌ను ఎంచుకున్నాడు. విఖ్యాత వేలమ్మాళ్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిన అరవింద్‌ చదువుకునే రోజుల్లో ఇప్పటి ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌కు సీనియర్‌. 

గుకేశ్‌ కూడా వేలమ్మాళ్‌ విద్యార్థే! ప్రాగ్‌ మాస్టర్స్‌లాంటి మేటి టోర్నీల్లో సాధారణంగా టాప్‌–20 ర్యాంకింగ్‌ ప్లేయర్లకు పాల్గొనే అవకాశముంటుంది. అంతకుమించి ర్యాంకుల్లో ఉంటే నిర్వాహకుల నుంచి వైల్డ్‌కార్డ్‌లాంటి ఎంట్రీలు ఉండాల్సిందే. అలా వచ్చిన అవకాశాన్ని అరవింద్‌ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.  

2013లో తొలి జీఎమ్‌ నార్మ్‌ 
భారత విఖ్యాత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ 2013లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు ప్రపంచ చెస్‌ చాంపియన్‌ కిరీటాన్ని కోల్పోయిన ఏడాదే పాఠశాల విద్యనభ్యసిస్తున్న అరవింద్‌ తొలి గ్రాండ్‌మాస్టర్‌ (జీఎమ్‌) నార్మ్‌ పొందాడు. అక్కడి నుంచి అతని ఆట మరో దశకు చేరడంతో 2015లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా లభించింది. అడపాదడపా టోర్నీల్లో గెలుస్తున్నప్పటికీ 2019 అతని కెరీర్‌ను మలుపుతిప్పింది. 

భారత ఓపెన్‌లో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఇలా మూడు విభాగాల్లోనూ అరవింద్‌ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. దాంతో పాటే తొలిసారి 2700 ఎలో రేటింగ్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రాగ్‌ టైటిల్‌తో లైవ్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో అరవింద్‌ 14వ స్థానంలో ఉన్నాడు. భారత్‌ తరఫున నాలుగో ర్యాంకర్‌గా 
ఎదిగాడు.

#

Tags : 1

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)