Breaking News

స‌చిన్ కొడుకుకు చుక్కలు చూపించారు? వేలంలో ఎవ‌రైనా కొంటారా?

Published on Sat, 11/23/2024 - 16:50

ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడు, గోవా ఆల్‌రౌండ‌ర్ అర్జున్ టెండూల్క‌ర్.. టీ20ల్లో మాత్రం త‌న మార్క్‌ను చూపించలేక‌పోతున్నాడు.  సయ్యద్ ముస్తాక్ అలీ-2024 ట్రోఫీలో భాగంగా హైద‌రాబాద్ వేదిక‌గా ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో అర్జున్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 

అత‌డి బౌలింగ్‌ను ముంబై బ్యాట‌ర్లు ఊతికారేశారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అయితే అర్జున్‌ను ఊచ‌కోత కోశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన జూనియ‌ర్ టెండూల్క‌ర్‌.. 12.00 ఏకాన‌మీతో ఏకంగా 48 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. క‌నీసం ఒక్క వికెట్ కూడా అర్జున్ సాధించ‌లేక‌పోయాడు.

అర్జున్‌ అమ్ముడుపోతాడా?
ఈ క్ర‌మంలో నవంబ‌ర్ 24, 25వ తేదీల్లో జ‌రిగే ఐపీఎల్‌-2025 మెగా వేలంలో అర్జున్ అస్స‌లు అమ్ముడు పోతాడా అన్న‌ది ప్ర‌శ్న‌ర్ధాకంగా మారింది. అర్జున్ టెండూల్క‌ర్ ఐపీఎల్‌-2023, 2024 సీజ‌న‌ల్లో ముంబై ఇండియ‌న్స్ ప్రాతినిథ్యం వ‌హించాడు. ఈ రెండు సీజ‌న్ల‌లో మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్‌.. కేవలం మూడు వికెట్లు మాత్రమే సాధించగలిగాడు.

దీంతో ఈసారి అత‌డిని ముంబై కూడా కొనుగోలు చేసే సూచ‌నలు క‌న్పించ‌డం లేదు. ఈ వేలంలో రూ. 30 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌గా న‌మోదు చేసుకున్న అర్జున్‌.. ఈసారి అమ్ముడుపోక‌పోయినా ఆశ్చర్యపోన్క‌ర్లేదు.

శ్రేయస్‌ అయ్యర్‌ ఊచకోత.. 
ఇక ఈ మ్యాచ్‌లో గోవాపై 26 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటిం‍గ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. ముంబై కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(130) సెంచరీతో మెరిశాడు.

 అనంతరం లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్‌(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్‌ ద్యాస్‌, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్‌ ఠాకూర్‌, మొహిత్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)