Breaking News

సచిన్‌ కొడుకుకు ఏమైంది..? కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా

Published on Tue, 02/06/2024 - 10:51

రంజీ ట్రోఫీ సీజన్‌ 2023-24లో సచిన్‌ టెండూల్కర్‌ తనయడు, గోవా ఆల్‌ ఆల్‌రౌండర్‌ అర్జున్ టెండూల్కర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ అర్జున్‌ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్‌ విఫలమయ్యాడు. బౌలింగ్‌లో కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన జూనియర్‌ టెండూల్కర్‌.. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.

ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్ రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 9 ఇన్నింగ్స్‌లలో 182 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అటు బౌలింగ్‌లోనూ అంతంతమాత్రమే. కేవలం బౌలింగ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. 

                                                   

కాగా తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ను ముంబై తరపున ఆరంభించిన అర్జున్‌.. ఇప్పుడు గోవాకు ప్రాతినిథ్యం వహించాడు. జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబై క్రికెట్‌ ఆసోషియేషన్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకుని గోవా జట్టుతో చేరాడు. అక్కడ అవకాశాలు వచ్చిననప్పటికీ వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమవుతున్నాడు.

తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 882 పరుగులతో పాటు 16 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున అర్జున్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్‌ వార్నర్‌కు ఛాన్స్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)