Breaking News

ఐదు వికెట్లతో చెలరేగిన అర్జున్‌ టెండుల్కర్‌.. మెగా వేలంలో...

Published on Wed, 11/13/2024 - 16:18

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్‌రౌండర్‌.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అర్జున్‌ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. 84 పరుగులకే ఆలౌట్‌ అయింది.

గోవాకు ప్రాతినిథ్యం
కాగా ముంబైకి చెందిన అర్జున్‌ టెండుల్కర్‌ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్‌ అయిన అర్జున్‌.. లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ కూడా! ఇక 25 ఏళ్ల అర్జున్‌ రంజీ ట్రోఫీ 2024-25లో ప్లేట్‌ గ్రూపులో ఉన్న గోవా.. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో తలపడుతోంది.

పొర్వోరిమ్‌లోని గోవా క్రికెట్‌ అసోసియేషన్‌ అకాడమీ గ్రౌండ్‌లో బుధవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన అరుణాచల్‌ ప్రదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే అటాక్‌ మొదలుపెట్టిన గోవా ఆల్‌రౌండర్‌ అర్జున్‌ టెండుల్కర్‌..  ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు.

టాప్‌-5 వికెట్లు అతడి ఖాతాలోనే
అర్జున్‌ ధాటికి టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌  కకావికలమైంది. ఓపెనర్‌ నబాం హచాంగ్‌ను డకౌట్‌ చేయడంతో వికెట్ల వేట మొదలుపెట్టిన అర్జున్‌.. మరో ఓపెనర్‌ నీలం ఒబి(22), వన్‌డౌన్‌ బ్యాటర్‌ చిన్మయ్‌ పాటిల్‌(3), నాలుగో స్థానంలో వచ్చిన జే భస్వార్‌(0), ఐదో నంబర్‌ బ్యాటర్‌ మోజీ ఎటె(1)లను పెవిలియన్‌కు పంపాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్లో‌ తొలి ఐదు వికెట్ల ప్రదర్శన
తద్వారా అర్జున్‌ టెండుల్కర్‌.. తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్లో‌ తొలి ఐదు వికెట్ల ప్రదర్శన(5 Wicket Haul) నమోదు చేశాడు. ఇక అర్జున్‌తో పాటు గోవా బౌలర్లలో కేత్‌ పింటో రెండు, మోహిత్‌ రేడ్కర్‌ మూడు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే కుప్పకూలిన అరుణాచల్‌ ప్రదేశ్‌.. 84 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

ముంబై తరఫున 
కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్‌ ఈమేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం.. అతడికి సానుకూలాంశంగా మారింది. ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. 

ఇక సచిన్‌ టెండుల్కర్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్‌ తరఫున అర్జున్‌ గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. 

అయితే, రిటెన్షన్స్‌లో భాగంగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న ముంబై.. అర్జున్‌ను వదిలివేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్‌ వేలంపాట జరుగనుంది.

చదవండి: ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ మా దేశంలోనే.. పాక్‌ ప్రభుత్వ వైఖరి ఇదే!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)