Breaking News

‘టైబ్రేక్‌’కు అర్జున్‌ పోరు

Published on Wed, 11/19/2025 - 03:25

పనాజీ (గోవా): ‘ఫిడే’ ప్రపంచ కప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు అర్జున్‌ ఇరిగేశి క్వార్టర్‌ ఫైనల్‌ పోరు ‘టైబ్రేక్‌’కు చేరింది. అర్జున్, చైనా గ్రాండ్‌మాస్టర్‌ వె యి మధ్య మంగళవారం జరిగిన రెండో గేమ్‌ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. 

వీరి మధ్య సోమవారం జరిగిన తొలి గేమ్‌ కూడా సమంగా ముగిసింది. దాంతో ఫలితం తేల్చేందుకు బుధవారం ‘టైబ్రేక్‌’ నిర్వహిస్తారు. రెండో గేమ్‌లో తెల్ల పావులతో బరిలోకి దిగిన అర్జున్‌ పలు సందర్భాల్లో ఆధిక్యం ప్రదర్శించినా... దానిని చివరి వరకు నిలబెట్టుకోలేకపోయాడు. 

ఈ టోర్నీలో మిగిలిన ఎనిమిది మంది ఆటగాళ్లలో అత్యుత్తమ ర్యాంకింగ్‌ ఉన్న అర్జున్‌ మిడిల్‌ గేమ్‌ను చూస్తే గెలుపు ఖాయమనిపించింది. కానీ కీలక దశలో ఒక ఎత్తును తప్పుగా వేయడంతో దీనిని వె యి సమర్థంగా వాడుకొని తప్పించుకోగలిగాడు. ఆ తర్వాత ‘డ్రా’ తప్ప మరో ఫలితానికి అవకాశం లేకపోయింది. అయితే ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో అర్జున్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. 

మరో క్వార్టర్‌ ఫైనల్‌లో అలెగ్జాండర్‌ డొన్‌చెంకో (జర్మనీ)ను నాదిర్‌బెక్‌ యాకుబోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఆండ్రీ ఎసిపెంకో (రష్యా), స్యామ్‌ షాంక్‌లాండ్‌ (అమెరికా) మధ్య...జోస్‌ మార్టినెజ్‌ (మెక్సికో), జవోఖిర్‌ సిండ్రోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) మధ్య జరిగిన రెండో గేమ్‌లు కూడా ‘డ్రా’ ముగిశాయి. దాంతో ఈ రెండు మ్యాచ్‌లలో కూడా సెమీస్‌ చేరేదెవరో నేడు జరిగే ‘టైబ్రేక్‌’లోనే తేలనుంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)