Breaking News

భారత షూటర్ల జోరు

Published on Sat, 10/28/2023 - 01:40

చాంగ్వాన్‌ (కొరియా): ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రైఫిల్‌ షూటర్లు అర్జున్‌ బబుతా, తిలోత్తమ సేన్‌ రజత పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత్‌కు రెండు ఒలింపిక్స్‌ కోటా బెర్త్‌లు దక్కాయి. ఇప్పటికే భారత షూటర్లు 8 బెర్తులు పొందారు. దీంతో వచ్చే ఏడాది పారిస్‌కు పయనమయ్యే షూటర్ల సంఖ్య పదికి చేరింది.

శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో 24 ఏళ్ల అర్జున్‌ 251.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ ఫైనల్లో 15 ఏళ్ల తిలోత్తమ (252.3 పాయింట్లు) త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. కొరియన్‌ షూటర్‌ కోన్‌ ఎంజీ (252.4) 0.1 తేడాతో బంగారం గెలుచుకుంది. ఇదే విభాగంలో టీమ్‌ ఈవెంట్‌లో అర్జున్, దివ్యాన్‌‡్ష, హృదయ్‌ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది.

తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యంతో సంతృప్తి చెందింది. సీనియర్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అనంత్‌జీత్‌ సింగ్, దర్శన రాథోడ్‌ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)