Breaking News

బ్రెజిల్‌కు బిగ్‌ షాక్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్జెంటీనా

Published on Tue, 02/13/2024 - 07:23

కరకస్‌ (వెనిజులా): బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు అర్జెంటీనా షాక్‌ ఇచ్చింది. రియో, టోక్యో ఒలింపిక్స్‌ చాంపియన్‌ అయిన బ్రెజిల్‌... ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ సాధించాలనే ఆశల్ని క్వాలిఫయింగ్‌ దశలోనే అర్జెంటీనా ఆవిరి చేసింది. దక్షిణ అమెరికా ఒలింపిక్‌ ఫుట్‌బాల్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌ అర్జెంటీనా 1–0తో బ్రెజిల్‌ను    కంగుతినిపించింది.

హోరాహోరీగా సాగిన ఈ పోరులో 78వ నిమిషంలో లూసినో గొండో చేసిన గోల్‌తో అర్జెంటీనా విజయం సాధించింది. తద్వారా దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్‌ నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌కు రెండో జట్టుగా అర్జెంటీనా అర్హత సంపాదించింది. ఈ గ్రూప్‌లో ఇదివరకే పరాగ్వే 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అర్హత పొందింది. బ్రెజిల్‌ చివరిసారిగా 20 ఏళ్ల క్రితం 2004–ఏథెన్స్‌ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేదు. మరోవైపు అర్జెంటీనా 2004, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచింది.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)