Breaking News

ఆ ఆర్చర్‌ గురికి ఒకటే పాయింట్‌!

Published on Thu, 08/01/2024 - 03:57

పారిస్‌: ఆర్చరీ పోటీల్లో గురి లక్ష బిందువుపైనే ఉంటుంది. ఇది కుదిరితే 10 కాస్త అటుఇటు తప్పితే 9, 8, 7 పాయింట్లు సహజం. కానీ ఆఫ్రికన్‌ దేశం చాద్‌ ఆర్చర్‌ ఇజ్రాయెల్‌ మదయె దాదాపు టార్గెట్‌ రింగ్స్‌ బోర్డుకే దూరమయ్యే బాణం సంధించాడు. త్రుటిలో బోర్డులో పడింది... కానీ వచి్చంది ఒకే పాయింట్‌! వినడానికి విడ్డూరంగా ఉన్న మదయె రెండో సెట్‌లో మూడు షాట్లలో ఒకటి ఒక్క పాయింటే తెచ్చి పెట్టింది. విలువిద్యలో కొరియన్‌ ఆర్చర్లకు తిరుగుండదు. 

పైగా  మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ అయిన కిమ్‌ వూ జిన్‌ ముందు 36 ఏళ్ల మదయె ఓ పిల్లబచ్చ! ఈ మ్యాచ్‌లో 26–29, 15–29, 25–30 స్కోరుతో కిమ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి సెట్‌లో 26 పాయింట్లు సాధించిన మదయె రెండో సెట్‌లో కేవలం 15 పాయింట్లే చేశాడు. అంటే మూడు బాణాల స్కోరుకు (10+10+10)కు సగమన్నమాట! 

ఇందులో మూడో షాట్‌ ఒక పాయింట్‌ తేవడంతో అతను సగం స్కోరుకు పరిమితమయ్యాడు. అయితే మూడో సెట్‌లో పుంజుకొని 25 పాయింట్లు సాధించాడు. ఇంత ఘోరంగా మదయె ఓడినప్పటికీ స్టేడియంలోని కొరియన్‌ అభిమానుల నుంచి ఓదార్పు లభించింది. చప్పట్లతో మదయెకు వీడ్కోలు పలికారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)