Breaking News

APL 2023: ధరణీకుమార్‌ మెరుపులు.. గోదావరి టైటాన్స్‌కు తప్పని ఓటమి

Published on Wed, 08/23/2023 - 08:57

విశాఖ స్పోర్ట్స్‌: ఏపీఎల్‌–2 సీజన్‌లో భాగంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోస్టల్‌ రైడర్స్‌ 35 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోస్టల్‌ రైడర్స్‌ ఓపెనర్‌ ప్రణీత్‌ 15 పరుగులు చేసి మాధవ్‌ బౌలింగ్‌లో ఇస్మాయిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

రైడర్స్‌ కెప్టెన్‌ రషీద్‌ 7 పరుగులే చేసినా ఓపెనర్‌ ధరణీకుమార్‌(32 బంతుల్లో 59, 8x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. హర్షవర్ధన్‌ (నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 22 బంతుల్లో 35)తో కలిసి లేఖజ్‌ రెడ్డి(12) ఇన్నింగ్స్‌ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన రైడర్స్‌.. మరో 63 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా తొమ్మిది వికెట్లకు 173 పరుగులు చేసింది. సత్యనారాయణ రాజు, సమన్విత్‌ మూడేసి వికెట్లు తీయగా మాధవ్‌ రెండు, విజయ్‌ ఒక వికెట్‌ తీశారు.

లక్ష్య ఛేదనకు దిగిన గోదావరి టైటాన్స్‌ ఓపెనర్లు వంశీకృష్ణ(4) 10 పరుగుల వద్ద, కెప్టెన్‌ జానేశ్వర్‌ (14) 28 పరుగుల వద్ద వెనుదిరిగారు. హేమంత్‌రెడ్డి ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ధీరజ్‌కుమార్‌(10), పాండురంగరాజు(14) వికెట్లను 94 పరుగుల స్కోర్‌ వద్ద కోల్పోయింది.

ఇస్మాయిల్‌ ఎనిమిది బంతుల్లో 19 పరుగులతో చివర్లో కాస్త మెరుపులు మెరిపించినా 18.1 ఓవర్లలోనే 138 పరుగులకు గోదావరి టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అబ్దుల్లా మూడు, సుదర్శన్‌, చిరంజీవి, స్టీఫెన్‌ రెండేసి వికెట్లు తీశారు. ఆశిష్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

చదవండి: అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్‌

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)