Breaking News

APL 2023: ప్లే ఆఫ్స్‌లో ఆ రెండు జట్లు.. రేసులోకి బెజవాడ టైగర్స్‌ కూడా

Published on Wed, 08/23/2023 - 09:14

విశాఖ స్పోర్ట్స్‌: ఏపీఎల్‌–2 సీజన్‌లో లీగ్‌ చివరి మ్యాచ్‌ ఆడిన వైజాగ్‌ వారియర్స్‌, బెజవాడ టైగర్స్‌ జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. ఓపెనర్లు మూడు పరుగులకే పెవిలియన్‌కు చేరినా బెజవాడ టైగర్స్‌ భారీ స్కోర్‌ను అధిగమించి ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

వైఎస్సార్‌ స్టేడియంలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వైజాగ్‌ వారియర్స్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఓపెనర్లు అర్జున్‌(47), ప్రశాంత్‌ కుమార్‌(53) తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం అందించారు. కెప్టెన్‌ కరణ్‌ షిండే (55) అర్ధ సెంచరీ నమోదు చేయగా.. యువన్‌(15) సహకారం అందించాడు. కెప్టెన్‌ కరణ్‌ అజేయంగా నిలిచాడు.

సాయితేజ రెండు వికెట్లు తీయగా అఖిల్‌, లలిత్‌ మోహన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ప్రతిగా బెజవాడ టైగర్స్‌ ఓపెనర్‌ అభినవ్‌ డకౌట్‌ గానే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్‌ మహీప్‌ రెండు పరుగులకే చేతులెత్తేశాడు. మనీష్‌(15)ఫోర్‌, సిక్సర్‌ బాది పెవిలియన్‌కు చేరడంతో తొలి మూడు వికెట్లు 23 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో షోయబ్‌.. రికీబుయ్‌(33)తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులను, అవినాష్‌తో కలిసి మరో 50 పరుగులను జోడించాడు.

షోయబ్‌ (51) ఆరు ఫోర్లతో అర్ధసెంచరీ చేయగా సాయికుమార్‌, దుర్గాకుమార్‌ చెరో ఎనిమిదేసి పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. అవినాష్‌(71) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించాడు.

ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన బెజవాడ టైగర్స్‌  మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం జరిగే ఉత్తరాంధ్ర లయన్స్‌, గోదావరి టైటాన్స్‌ మ్యాచ్‌ అనంతరం ప్లే ఆఫ్‌కు మిగిలిన రెండు బెర్త్‌లు తేలిపోనున్నాయి. ఇప్పటికే 12 పాయింట్లతో రాయలసీమ కింగ్స్‌, కోస్టల్‌ రైడర్స్‌ ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)