Breaking News

అదరగొట్టిన ప్రణీత్‌.. 8 వికెట్ల తేడాతో కోస్టల్‌ రైడర్స్‌ విజయం 

Published on Thu, 08/24/2023 - 07:24

విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక కోస్టల్‌ రైడర్స్‌ జట్టు 16 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్‌ 12 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్‌ 8 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా ఉత్తరాంధ్ర లయన్స్‌కు రెండో స్థానం, రాయలసీమ కింగ్స్‌కు మూడో స్థానం, బెజవాడ టైగర్స్‌కు నాలుగో స్థానం లభించాయి. కోస్టల్‌ రైడర్స్‌తోపాటు ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌తో బెజవాడ టైగర్స్‌ ... క్వాలిఫయర్‌–1లో ఉత్తరాంధ్ర లయన్స్‌తో కోస్టల్‌ రైడర్స్‌ ఆడతాయి.

రాయలసీమ కింగ్స్‌తో చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో కోస్టల్‌ రైడర్స్‌ జట్టు వీజేడీ పద్ధతిలో 8 వికెట్లతో గెలిచింది. ముందుగా రాయలసీమ కింగ్స్‌ 18 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. హనీష్‌ రెడ్డి (78; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిశాడు. వర్షం తగ్గాక కోస్టల్‌ రైడర్స్‌ జట్టుకు 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. కోస్టల్‌ జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. ప్రణీత్‌ (64 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), చిరంజీవి (32 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడారు. మరో మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్‌ ఏడు వికెట్లతో గోదావరి టైటాన్స్‌ను ఓడించింది.
చదవండి: ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)