Breaking News

అంతిమ్‌ అదరహో

Published on Fri, 09/22/2023 - 02:03

బెల్‌గ్రేడ్‌: భారత మహిళా టీనేజ్‌ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌ అద్భుతం చేసింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అంతిమ్‌ ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో అండర్‌–20 ‘డబుల్‌ ప్రపంచ చాంపియన్‌’ అంతిమ్‌ 16–6 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, యూరోపియన్‌ చాంపియన్‌ ఎమ్మా జోనా డెనిస్‌ మాల్‌్మగ్రెన్‌ (స్వీడన్‌)పై విజయం సాధించింది.

ఈ గెలుపుతో అంతిమ్‌ వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో భారత రెజ్లర్లు యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ పతాకంపై పోటీపడుతున్నారు. అంతిమ్‌ 2022, 2023 ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌íÙప్‌లో 53 కేజీల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు 2023 ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచింది.  

8 ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన ఎనిమిదో భారతీయ రెజ్లర్‌గా అంతిమ్‌ పంఘాల్‌ గుర్తింపు పొందింది. గతంలో అల్కా తోమర్‌ (2006; కాంస్యం), బబిత ఫొగాట్‌ (2012; కాంస్యం), గీతా ఫొగాట్‌ (2012; కాంస్యం), వినేశ్‌ ఫొగాట్‌ (2019, 2022; కాంస్యాలు), పూజా ధాండ (2018; కాంస్యం), అన్షు మలిక్‌ (2021; రజతం), సరితా మోర్‌ (2021; కాంస్యం) ఈ ఘనత సాధించారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)