Breaking News

ప్రిక్వార్టర్స్‌లో అన్‌మోల్‌

Published on Sun, 12/22/2024 - 04:10

బెంగళూరు: డిఫెండింగ్‌ చాంపియన్‌ అన్‌మోల్‌ ఖర్బ్, గతేడాది రన్నరప్‌ తన్వీ శర్మ జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. మాజీ చాంపియన్లు మిథున్‌ మంజునాథ్, సౌరభ్‌ వర్మలు అలవోక విజయాలతో మూడో రౌండ్‌కు చేరారు. కానీ పురుషుల డిఫెండింగ్‌ చాంపియన్‌ చిరాగ్‌ సేన్‌కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. 

శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో అన్‌మోల్‌ 21–14, 21–14తో కృషిక మహాజన్‌పై గెలుపొందగా, తన్వీ శర్మ 21–12, 21–8తో స్వాతి సోలంకిపై సునాయాస విజయం సాధించింది. రుజుల రాము 21–19, 19–21, 21–17తో పదో సీడ్‌ సూర్యచరిష్మ తమిరిపై, జియా రావత్‌ 25–27, 21–14, 21–10తో తొమ్మిదో సీడ్‌ శ్రుతి ముందాడపై గెలుపొందారు. 

పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో చిరాగ్‌ సెన్‌ను తమిళనాడు షట్లర్‌ రిత్విక్‌ కంగుతినిపించాడు. తొలి గేమ్‌ను సులువుగా గెలుచుకున్న చిరాగ్‌కు తర్వాతి గేముల్లో రితి్వక్‌ నుంచి ఊహించని పోటీ ఎదురవడంతో చేతులెత్తేశాడు. చివరకు రిత్విక్‌ 12–21, 21–19, 21–15తో చిరాగ్‌ సేన్‌పై విజయం సాధించాడు. 

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రిత్విక్‌... ఎమ్‌. రఘుతో తలపడనున్నాడు. మిథున్‌ మంజునాథ్‌ 21–9, 21–18తో మూడో సీడ్‌ భరత్‌ రాఘవ్‌ను, సౌరభ్‌ వర్మ 21–17, 21–17తో అభినవ్‌ గార్గ్‌ను ఓడించారు. రోహన్‌ గుర్బాని 21–15, 21–1తో 11వ సీడ్‌ లోకేశ్‌ రెడ్డిపై, రఘు 21–19, 21–16తో కార్తీక్‌ జిందాల్‌పై గెలిచారు.    

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)