Breaking News

సెమీఫైనల్లో అన్‌మోల్‌ పరాజయం

Published on Sun, 10/12/2025 - 03:58

వాంటా (ఫిన్‌లాండ్‌): భారత రైజింగ్‌ షట్లర్‌ అన్‌మోల్‌ ఖరబ్‌... అర్క్‌టిక్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్లో పరాజయం పాలైంది. చక్కటి ఆటతీరుతో సెమీస్‌ వరకు చేరిన అన్‌మోల్‌... ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌) చేతిలో ఓడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 62వ ర్యాంకర్‌ అన్‌మోల్‌ 10–21, 13–21తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌ యామగుచి చేతిలో ఓడింది. 

29 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఫరీదాబాద్‌కు చెందిన 18 ఏళ్ల టీనేజ్‌ షట్లర్‌ అన్‌మోల్‌... యామగుచి ఎదుట నిలువలేకపోయింది. వరుస గేమ్‌ల్లో ఓడి టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. రెండు గేమ్‌ల్లోనూ అన్‌మోల్‌ కాస్త పోరాటం కనబర్చినా... జపాన్‌ స్టార్‌ అనుభవం ముందు అది సరిపోలేదు. తొలిసారి సూపర్‌–500 టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరిన అన్‌మోల్‌ అక్కడితోనే వెనుదిరిగింది. ఈ ప్రదర్శనతో అన్‌మోల్‌కు 18,050 డాలర్ల (సుమారు 16 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)