Breaking News

అనిరుధ్‌ జోడీకి టైటిల్‌

Published on Sun, 09/28/2025 - 04:28

సాక్షి, హైదరాబాద్‌: జింగ్‌షాన్‌ ఓపెన్‌ ఏటీపీ–100 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో అనిరుధ్‌ చంద్రశేఖర్‌ జంట టైటిల్‌ చేజిక్కించుకుంది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌ చంద్రశేఖర్‌ (భారత్‌)–రిసీ స్టాల్డర్‌ (అమెరికా) జంట విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అనిరు«ద్‌–రిసీ స్టాల్డర్‌ జోడీ 6–2, 2–6, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సుంగ్‌ హావో హువాంగ్‌ (చైనీస్‌ తైపీ)–యుసింగ్‌ పార్క్‌ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. 

హోరాహోరీగా సాగిన ఈ పోరులో అనిరుధ్‌ జంట 2 ఏస్‌లు సంధించి... 3 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌ను సునాయాసంగానే నెగ్గిన అనిరు«ద్‌–స్టాల్డర్‌  జోడీకి రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఇక ఉత్కంఠభరితంగా సాగిన నిర్ణయాత్మక మూడో సెట్‌ ‘సూపర్‌ టైబ్రేక్‌’కు చేరగా... ఒత్తిడిని అధిగమించి కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన భారత జంట విజేతగా నిలిచింది. 67 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో 2 బ్రేక్‌ పాయింట్లు సాధించిన అనిరు«ద్‌–స్టాల్డర్‌ జోడీ... మొత్తం 49 పాయింట్లు నెగ్గింది. తమ సర్వీస్‌లో 34 పాయింట్లు సాధించి ముందంజ వేసింది.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)