Breaking News

PKL 2025: యు ముంబా హెడ్‌ కోచ్‌గా అనిల్‌

Published on Tue, 05/27/2025 - 13:44

ప్రొ కబడ్డీ లీగ్‌  (పీకేఎల్‌) 12వ  సీజన్‌లో యు ముంబా జట్టుకు అనిల్‌ చప్రానా హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. పీకేఎల్‌ 11వ సీజన్‌లో యు ముంబా జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న గులామ్‌రజా మజందరాని (ఇరాన్‌) సీజన్‌ ముగిశాక తన బాధ్యతల  నుంచి వైదొలిగాడు.

గత సీజన్‌లో అనిల్‌ చప్రానా యు ముంబా జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పని చేశాడు. గులాంరజా తప్పుకున్న తర్వాత 12వ సీజన్‌ కోసం భారత మాజీ ప్లేయర్‌ రాకేశ్‌ కుమార్‌ను యు ముంబా కొత్త హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. అయితే ఆదివారం అనూహ్య పరిణామంచోటు చేసుకుంది. 

రాకేశ్‌ను హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పిస్తున్నామని ముంబా సీఈఓ సుహైల్‌ చందోక్‌ తెలిపారు. రాకేశ్‌తో సంప్రదింపులు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చందోక్‌ వివరించారు. 2022లో యు ముంబా జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న అనిల్‌ చప్రానాకు మరోసారి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నామని, అసిస్టెంట్‌ కోచ్‌గా పారి్థబన్‌ను ఎంపిక చేశామని సోమవారం సదరు ఫ్రాంచైజీ పేర్కొంది. 

ఈనెల 31న, జూన్‌ 1న పీకేఎల్‌ 12వ సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం జరగనుంది. 2014లో పీకేఎల్‌ ఆరంభ సీజన్‌ నుంచి పోటీపడుతున్న యు ముంబా జట్టు రెండుసార్లు రన్నరప్‌గా, ఒకసారి చాంపియన్‌గా (2015) నిలిచింది. గత సీజన్‌లో యు ముంబా టాప్‌–6లో నిలిచి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ చేతిలో ఓడింది.    

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)