Breaking News

టైటిల్‌ పోరుకు ఆండ్రీవా, చావ్లిన్‌స్కా

Published on Fri, 06/05/2026 - 04:21

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎనిమిదో సీడ్‌ మిరా ఆండ్రీవా (రష్యా), క్వాలిఫయర్‌ మాయ చావ్లిన్‌స్కా (పోలాండ్‌) టైటిల్‌ పోరుకు దూసుకొచ్చారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆండ్రీవా 76 నిమిషాల్లో 6–1, 6–3తో 15వ సీడ్‌ మార్టా కొస్టుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించగా... ప్రపంచ 114వ ర్యాంకర్‌ చావ్లిన్‌స్కా 2 గంటల 10 నిమిషాల్లో 7–6 (7/4), 6–4తో ప్రపంచ 23వ ర్యాంకర్‌ డియానా ష్నైడర్‌ (రష్యా)పై గెలుపొందింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆండ్రీవా, చావ్లిన్‌స్కాలకిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 

ష్నైడర్‌ను ఓడించిన క్రమంలో చావ్లిన్‌స్కా ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి క్వాలిఫయర్‌గా గుర్తింపు పొందింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా చావ్లిన్‌స్కా నిలిచింది. 2021 యూఎస్‌ ఓపెన్‌లో బ్రిటన్‌ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను క్వాలిఫయర్‌ హోదాలో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను సాధించి సంచలనం సృష్టించింది. 

శనివారం జరిగే ఫైనల్లో చావ్లిన్‌స్కా విజేతగా నిలిస్తే రాడుకాను సరసన చేరుతుంది. క్లే కోర్టు సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోని కొస్టుక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆండ్రీవా పూర్తి ఆధిపత్యం చలాయించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన ఆండ్రీవా 14 విన్నర్స్‌ కొట్టింది. మరోవైపు కొస్టుక్‌ 34 అనవసర తప్పిదాలు చేసింది. ష్నైడర్‌తో జరిగిన మ్యాచ్‌లో చావ్లిన్‌స్కా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయడంతోపాటు 32 విన్నర్స్‌ కొట్టింది. ష్నైడర్‌ 33 అనవసర తప్పిదాలు చేసింది.   

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)