Breaking News

Andre Russell: ‘అదే నా అత్యుత్తమ మ్యాచ్‌’

Published on Sun, 07/20/2025 - 07:41

కింగ్‌స్టన్‌ (జమైకా): అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్‌ తన కెరీర్‌లో 84 మ్యాచ్‌లలో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 163.08 స్ట్రైక్‌రేట్‌తో 1078 పరుగులు చేసిన అతను విండీస్‌ రెండు టి20 వరల్డ్‌ కప్‌ విజయాల్లో (2012, 2016) భాగంగా ఉన్నాడు. తన కెరీర్‌ విశేషాల గురించి చెబుతూ అతను తన అత్యుత్తమ మ్యాచ్‌ గురించి ప్రస్తావించాడు. 

2016 వరల్డ్‌ కప్‌లో భాగంగా ముంబైలో జరిగిన సెమీ ఫైనల్‌ పోరు తన ‘బెస్ట్‌’ అని అతను వెల్లడించాడు. వాంఖెడే మైదానంలో జరిగిన ఈ పోరులో ముందుగా భారత్‌ 192 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రసెల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ సమయంలో విండీస్‌ విజయానికి 41 బంతుల్లో 77 పరుగులు అవసరం కాగా...20 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో అజేయంగా 43 పరుగులు చేశాడు.

 కోహ్లి వేసిన చివరి ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ బాది అతను మ్యాచ్‌ను ముగించాడు. ఫైనల్‌ చేరిన విండీస్‌ ఆపై ఇంగ్లండ్‌ను ఓడించి రెండో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ‘నిస్సందేహంగా భారత్‌తో సెమీస్‌ మ్యాచే నా కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. 190 పరుగుల లక్ష్యం...సొంతగడ్డపై ఆడుతున్న భారత్‌కే ప్రేక్షకుల నుంచి పూర్తి మద్దతు ఉంది. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగా. అయితే పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉండటంతో నా ప్రణాళిక ప్రకారం చెలరేగి జట్టును గెలిపించా’ అని రసెల్‌ గుర్తుచేసుకున్నాడు.    

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు