Breaking News

నాకౌట్‌ బెర్త్‌ లక్ష్యంగా...

Published on Thu, 01/29/2026 - 04:04

న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో చివరి దశ పోటీలకు రంగం సిద్ధమైంది. నాకౌట్‌ దశకు ముందు జరగనున్న చివరి గ్రూప్‌ మ్యాచ్‌లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రూప్‌ ‘ఎ’లో నాగాలాండ్‌ జట్టుతో ఆంధ్ర తలపడనుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న రికీ భుయ్‌ సారథ్యంలోని ఆంధ్ర జట్టు... ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా నాకౌట్‌ దశకు అర్హత సాధించనుంది. 

నాగాలాండ్‌లోని సోవిమా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భపై చక్కటి విజయం సాధించిన ఆంధ్ర జట్టు ప్రస్తుతం 28 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. జార్ఖండ్, విదర్భ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

కెప్టెన్‌ రికీ భుయ్‌తో పాటు శ్రీకర్‌ భరత్, షేక్‌ రషీద్, టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ రెడ్డి, కరణ్‌ షిండేలతో ఆంధ్ర జట్టు బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. ఈ సీజన్‌లో ఏ ఒక్కరి ప్రతిభ మీదో ఆధారపడకుండా... ఆంధ్ర జట్టు సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లోనూ అదే మంత్రం జపించాలని చూస్తోంది. 

బౌలింగ్‌లో విజయ్, సాయితేజ, సౌరభ్‌ కుమార్, కేఎస్‌ఎన్‌ రాజు, శశికాంత్‌ కీలకం కానున్నారు. మరోవైపు తాజా సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి... ఒక మ్యాచ్‌ ‘డ్రా’ చేసుకొని ఒకే పాయింట్‌తో పట్టిక అట్టడుగున ఉన్న నాగాలాండ్‌ జట్టు... ఆంధ్ర టీమ్‌కు ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి. 

ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్‌ ‘ఢీ’ 
మరోవైపు గ్రూప్‌ ‘డి’లో పడుతూ లేస్తూ సాగుతున్న హైదరాబాద్‌ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో తలపడనుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నాకౌట్‌కు దూరమైంది. రెగ్యులర్‌ కెప్టెన్ తిలక్‌ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 

బ్యాటింగ్‌లో అభిరత్‌ రెడ్డి, అమన్‌ రావు, రాహుల్‌ సింగ్, హిమతేజ, రాహుల్‌ రాధేశ్, రోహిత్‌ రాయుడు, నితీశ్‌ రెడ్డి చామా మిలింద్‌ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్‌ సిరాజ్‌తో పాటు రక్షణ్‌ రెడ్డి, నితిన్‌ సాయి యాదవ్‌ కీలకం కానున్నారు. ఇతర కీలక మ్యాచ్‌ల్లో ఒడిశాతో జార్ఖండ్‌... ఉత్తరప్రదేశ్‌తో విదర్భ... బరోడాతో తమిళనాడు... మధ్యప్రదేశ్‌తో మహారాష్ట్ర... పంజాబ్‌తో కర్ణాటక... ముంబైతో ఢిల్లీ తలపడనున్నాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)