Breaking News

ఆంధ్ర అదుర్స్‌

Published on Mon, 01/26/2026 - 03:04

సాక్షి, అనంతపురం: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీలో కీలక విజయం సాధించింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఆదివారం ముగిసిన పోరులో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ జట్టుపై ఘనవిజయం అందుకుంది. 259 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 93/1తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు 56.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షేక్‌ రషీద్‌ (144 బంతుల్లో 132 నాటౌట్‌; 21 ఫోర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. కెపె్టన్‌ రికీ భుయ్‌ (92 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో వికెట్‌కు శ్రీకర్‌ భరత్‌ (89 బంతుల్లో 43; 5 ఫోర్లు)తో కలిసి 99 పరుగులు జోడించిన రషీద్‌... అబేధ్యమైన మూడో వికెట్‌కు రికీ భుయ్‌తో కలిసి 145 పరుగులు జతచేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 

ఇటీవల విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన విదర్భ జట్టు... ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ముందు నిలువలేకపోయింది. ఆ జట్టు బౌలర్లలో నచికేత్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. 6 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర జట్టు 4 విజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసింది. 28 పాయింట్లతో ఆంధ్ర గ్రూప్‌ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. 

జార్ఖండ్, విదర్భ జట్లు చెరో 25 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్‌ దశలో భాగంగా తమ చివరి మ్యాచ్‌లో గురువారం నుంచి నాగాలాండ్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఆంధ్ర జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.   
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)