Breaking News

ప్రియాన్షు అజేయ సెంచరీ

Published on Thu, 11/07/2024 - 08:46

సాక్షి, విజయనగరం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ మెరుగైన ఆరంభం దక్కలేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో అట్టడుగున కొనసాగుతోంది. విజయనగరం స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఉత్తరాఖండ్‌ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 232 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ ప్రియాన్షు ఖండూరి (272 బంతుల్లో 107 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగగా... మరో ఓపెనర్‌ అవ్‌నీశ్‌ (158 బంతుల్లో 86; 12 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 157 పరుగులు జోడించి ఉత్తరాఖండ్‌కు బలమైన పునాది వేశారు. 29 ఏళ్ల ప్రియాన్షుకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇది రెండో సెంచరీ కాగా... శతకం చేసేలా కనిపించిన అవ్‌నీశ్‌ను ఆంధ్ర స్పిన్నర్‌ లలిత్‌ మోహన్‌ అవుట్‌ చేశాడు.

ఆ తర్వాత కెప్టెన్ రవికుమార్‌ సమర్థ్‌ (30 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) కూడా సాధికారికంగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడిన ఉత్తరాఖండ్‌ ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్‌ చేసిన 2.66 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఉత్తరాఖండ్‌ను గురువారం ఆంధ్ర బౌలర్లు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి.  

స్కోరు వివరాలు 
ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌: అవ్‌నీశ్‌ (సి) షేక్‌ రషీద్‌ (బి) లలిత్‌ మోహన్‌ 86; ప్రియాన్షు ఖండూరి (బ్యాటింగ్‌) 107; రవికుమార్‌ సమర్థ్‌ (బ్యాటింగ్‌) 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (87 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి) 232. వికెట్ల పతనం: 1–157, బౌలింగ్‌: చీపురుపల్లి స్టీఫెన్‌ 19–6–42–0; శశికాంత్‌ 18–8–31–0; సత్యనారాయణ రాజు 15–3–50–0; లలిత్‌ మోహన్‌ 26–2–83–1; త్రిపురాణ విజయ్‌ 6–1–15–0; మారంరెడ్డి హేమంత్‌ రెడ్డి 3–0–6–0.  

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)