Breaking News

ఆంధ్రప్రదేశ్‌ శుభారంభం

Published on Fri, 11/29/2024 - 04:26

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన గ్రూప్‌ ‘హెచ్‌’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ 6–1 గోల్స్‌ తేడాతో బెంగాల్‌ జట్టును ఓడించింది. 

ఆంధ్రప్రదేశ్‌ తరఫున మునిపల్లి నాగ నందిని (22వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... పరికి లక్ష్మి (15వ నిమిషంలో), చిల్లూరు నాగతేజ (38వ నిమిషంలో), కెపె్టన్‌ కుప్పా తులసీ (46వ నిమిషంలో), రాగుల నాగమణి (60వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. బెంగాల్‌ జట్టుకు శ్రేష్ట ఛటర్జీ (43వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించింది.

గురువారమే జరిగిన ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో గత ఏడాది రన్నరప్‌ జార్ఖండ్‌ 5–0తో ఛత్తీస్‌గఢ్‌ జట్టుపై, ఉత్తరాఖండ్‌ 3–1తో రాజస్తాన్‌ జట్టుపై, కర్ణాటక 5–0తో జమ్మూ కశ్మీర్‌ జట్టుపై, ఒడిశా 5–0తో హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టుపై గెలిచాయి. గుజరాత్, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.  

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)