Breaking News

ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్లు వీరే..

Published on Mon, 11/25/2024 - 21:31

జెద్దా వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు పైలా అవినాష్‌, సత్యనారాయణ రాజు, షేక్ రషీద్ అమ్ముడుపోయారు. షేక్ ర‌షీద్ ఇప్ప‌టికే ఐపీఎల్‌లో ఓసారి సీఎస్‌కే జట్టులో భాగం కాగా.. అవినాష్‌,  సత్యనారాయణల‌కు మాత్రం తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడే అవకాశం ద‌క్కింది.

విశాఖపట్నంకు చెందిన అవినాష్‌ను కనీస ధర రూ. 30 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా 24 ఏళ్ల‌ అవినాష్‌కు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆంధ్ర ప్రీమియ‌ర్ లీగ్‌లో  బెజ‌వాడ టైగ‌ర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

ఏపీఎల్‌-2024 సీజ‌న్‌లో అవినాష్ అద‌ర‌గొట్టాడు. కేవ‌లం 5 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి 47.25 స‌గ‌టుతో 189 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని పంజాబ్ సొంతం చేసుకుంది. మ‌రోవైపు కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగొలు చేసింది. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆంధ్ర జ‌ట్టుకు ఆడుతున్న స‌త్యనారాయణ.. త‌న ఫాస్ట్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాటర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్ట‌గ‌ల‌డు. 

ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 6 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన అత‌డు 14 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే అత‌డిని ముంబై త‌మ జ‌ట్టులో చేర్చుకుంది. ఇక గుంటూరు క్రికెట‌ర్ షేక్ ర‌షీద్‌ను మరో సారి సీఎస్‌కే సొంతం చేసుకుంది. అతడు కూడా తన బేస్ ప్రైస్ రూ.30 లక్షలకే అమ్ముడుపోయాడు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)