Breaking News

ఆంధ్ర గెలుపు బోణీ

Published on Sat, 12/27/2025 - 02:38

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆంధ్ర జట్టు... రెండో పోరులో గెలుపుబాట పట్టింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో రైల్వేస్‌ను ఓడించింది. మొదట రైల్వేస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. రవి సింగ్‌ (76; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్ష్ యాదవ్‌ (59; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు సాధించారు. 

ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, కలిదిండి రాజు చెరో 3 వికెట్లు పడగొట్టగా... హేమంత్‌ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్‌ (74 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (41 బంతుల్లో 55 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. 

మారంరెడ్డి హేమంత్‌ రెడ్డి (35 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షేక్‌ రషీద్‌ (53 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశ్విన్‌ హెబ్బర్‌ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు), శ్రీకర్‌ భరత్‌ (23 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా తలా కొన్ని పరుగులు చేశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన హేమంత్‌ రెడ్డికి ‘ప్లేయర్‌ ఆప్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సోమవారం జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఒడిశా జట్టుతో ఆంధ్ర తలపడుతుంది.    

మళ్లీ ఓడిన హైదరాబాద్‌
రాజ్‌కోట్‌: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధ్రువ్‌ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్‌; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. 

లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో ధ్రువ్‌కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్‌ జగదీశన్‌ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్‌ సమం చేశాడు. అమన్‌ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశ్‌ రాథోడ్‌ (68; 6 ఫోర్లు), సమర్థ్‌ (63; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. 

అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్‌ గౌడ్‌ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... అభిరథ్‌ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్‌ రాహుల్‌ సింగ్‌ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)