Breaking News

ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టిన ఆంధ్ర బ్యాటర్..

Published on Mon, 02/19/2024 - 03:54

కడప స్పోర్ట్స్‌: కల్నర్‌ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్‌–23 క్రికెట్‌ టోర్నీలో భాగంగా రైల్వేస్‌ జట్టుతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్‌ మామిడి వంశీకృష్ణ (64 బంతుల్లో 110; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ ఒకే ఓవర్‌లోని వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు.

వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. రైల్వేస్‌ లెగ్‌ స్పిన్నర్‌ దమన్‌దీప్‌ సింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్లో వంశీకృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు సంధించాడు.

అనంతరం ఈ జోరు కొనసాగిస్తూ వంశీకృష్ణ 48 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీకే నాయుడు ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా వంశీకృష్ణ రికార్డు నెలకొల్పాడు. మామిడి వంశీకృష్ణతోపాటు వన్‌డౌన్‌ బ్యాటర్, కెపె్టన్‌ వంశీకృష్ణ (55; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ధరణి కుమార్‌ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకట్‌ రాహుల్‌ (61 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) కూడా రాణించారు.  

ఇంతకుముందు అంతర్జాతీయ వన్డేల్లో హెర్షల్‌ గిబ్స్‌ (దక్షిణాఫ్రికా), జస్కరణ్‌ మల్హోత్రా (అమెరికా)... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్‌ సింగ్‌ (భారత్‌), కీరన్‌ పొలార్డ్‌ (వెస్టిండీస్‌)... ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో (మూడు/నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు) గ్యారీ సోబర్స్‌ (వెస్టిండీస్‌), రవిశాస్త్రి (భారత్‌), లీ జెర్మన్‌ (న్యూజిలాండ్‌)... దేశవాళీ వన్డేల్లో తిసారా పెరీరా (శ్రీలంక), రుతురాజ్‌ గైక్వాడ్‌ (భారత్‌)... దేశవాళీ టి20ల్లో రోజ్‌ వైట్లీ (ఇంగ్లండ్‌), లియో కార్టర్‌ (న్యూజిలాండ్‌), హజ్రతుల్లా జజాయ్‌ (అఫ్గానిస్తాన్‌) ఒకే ఓవర్లో వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)