Breaking News

చాంపియన్‌ కాస్పరోవ్‌

Published on Sun, 10/12/2025 - 04:18

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ క్లచ్‌ చెస్‌ లెజెండ్స్‌ మ్యాచ్‌లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన పోరులో 62 ఏళ్ల కాస్పరోవ్‌ 13–11 పాయింట్ల తేడాతో ఆనంద్‌పై గెలుపొందాడు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్‌ చివరిసారి 1995లో న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ 107వ అంతస్తులో క్లాసికల్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీపడ్డారు. 

కాస్పరోవ్‌ 10.5–7.5తో ఆనంద్‌పై గెలిచి ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు. కాస్పరోవ్‌ 30 ఏళ్ల తర్వాత కూడా అదే ఆటతీరు చూపెట్టాడు. ఈ పోరులో మొత్తం 12 గేమ్‌లు నిర్వహించాల్సి ఉండగా... చివరి రెండు బ్లిట్జ్‌ గేమ్‌లకంటే ముందే కాస్పరోవ్‌ గెలిచాడు. విజేత కాస్పరోవ్‌కు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్‌ ఆనంద్‌కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. 

ఈ పోరు నిబంధనల ప్రకారం తొలి రోజున గేమ్‌లో గెలిస్తే ఒక పాయింట్‌... ‘డ్రా’ చేసుకుంటే అర పాయింట్‌ కేటాయించారు. రెండో రోజు జరిగిన గేమ్‌లో గెలిస్తే 2 పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్‌ ఇచ్చారు. మూడో రోజు శనివారం గేమ్‌ గెలిచిన వారికి 3 పాయింట్లు కేటాయించారు. ‘ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పలేను... కానీ విజయం సాధిస్తానని ఊహించలేదు. 

చాలా మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను ఫాలో అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఇది చాలా ప్రధాన్యత సంతరించుకుంది. రెండో గేమ్‌ అనంతరం రిలాక్స్‌ అయ్యాను. నా అంచనాలకు మించి రాణించాను’ అని కాస్పరోవ్‌ అన్నాడు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)