Breaking News

దిగ్గజాల సరసన లెడెకీ, డ్రెసెల్‌

Published on Mon, 08/05/2024 - 02:51

పారిస్‌: విశ్వ క్రీడల్లో అతికొద్ది మందికే సాధ్యమైన ఘనతను అమెరికా స్విమ్మర్లు కేటీ లెడెకీ, సెలబ్‌ డ్రెసెల్‌ సాధించారు. ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన క్రీడాకారుల జాబితాలో వీరిద్దరు మరో నలుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానానికి చేరుకున్నారు. తాజాగా పారిస్‌ ఒలింపిక్స్‌లో లెడెకీ, డ్రెసెల్‌ రెండు స్వర్ణాల చొప్పున సాధించారు. దాంతో ఓవరాల్‌గా ఒలింపిక్స్‌ క్రీడల్లో వీరిద్దరు నెగ్గిన పసిడి పతకాల సంఖ్య 9కి చేరుకుంది.

ఇప్పటికే ‘పారిస్‌’లో 1500 మీటర్లలో బంగారు పతకం గెలిచిన లెడెకీ ఆదివారం జరిగిన 800 మీటర్ల విభాగంలోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు డ్రెసెల్‌ 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ టీమ్‌ స్వర్ణానికి 4్ఠ100 మీటర్ల మిక్స్‌డ్‌ మెడ్లే పసిడి పతకాన్ని జత చేశాడు. ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన రికార్డు అమెరికా స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ (23 స్వర్ణాలు) పేరిట ఉంది. 

ఆ తర్వాత 9 స్వర్ణాలతో లారిసా లాతినినా (జిమ్నాస్టిక్స్‌; సోవియట్‌ యూనియన్‌), పావో నుర్మీ (అథ్లెటిక్స్‌; ఫిన్‌లాండ్‌), మార్క్‌ స్పిట్జ్‌ (స్విమ్మింగ్‌; అమెరికా), కార్ల్‌ లూయిస్‌ (అథ్లెటిక్స్‌; అమెరికా), కేటీ లెడెకీ, డ్రెసెల్‌ ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.    

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)