Breaking News

విజేత అరోనియన్‌

Published on Sun, 08/17/2025 - 04:14

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. బ్లిట్జ్‌ విభాగంలో 18 పాయింట్లతో వియత్నాంకు చెందిన లియామ్‌ లె క్వాంగ్‌తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. అమెరికా ప్లేయర్‌ లెవాన్‌ అరోనియన్‌ 24.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన అరోనియన్‌... మరో రెండు రౌండ్‌లు మిగిలుండగానే టైటిల్‌ గెలుచుకున్నాడు. 

ఫాబియానో కరువానా (అమెరికా; 21.5 పాయింట్లు), మ్యాక్సిమ్‌ లాగ్రేవ్‌ (ఫ్రాన్స్‌; 21 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇటీవల లాస్‌ వెగాస్‌ ్రïఫీస్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన 42 ఏళ్ల అరోనియన్‌... అదే జోరులో ఇక్కడ కూడా విజేతగా నిలిచాడు. అరోనియన్‌కు 40 వేల డాలర్లు (సుమారు రూ. 35 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

రెండు రోజుల విశ్రాంతి అనంతరం గుకేశ్‌ సింక్యూఫీల్డ్‌ కప్‌లో బరిలోకి దిగనున్నాడు. దీంట్లో భారత్‌ నుంచి యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద కూడా పాల్గొననున్నాడు. సింక్యూఫీల్డ్‌ టోర్నీ క్లాసికల్‌ పోరు కావడంతో ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌ అయిన గుకేశ్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగే అవకాశం ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)