Breaking News

అనిసిమోవా అదరహో

Published on Mon, 02/17/2025 - 04:06

దోహా: ఎనిమిదేళ్ల క్రితం మహిళల టెన్నిస్‌లో భవిష్యత్‌ తారగా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా ప్లేయర్‌ అమండా అనిసిమోవా ఎట్టకేలకు తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. గ్రాండ్‌స్లామ్‌ తర్వాత రెండో అత్యున్నత శ్రేణి అయిన మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) 1000 సిరీస్‌ టోర్నీలో ఆమె మొదటిసారి విజేతగా అవతరించింది. ఖతర్‌ ఓపెన్‌లో 23 ఏళ్ల అనిసిమోవా చాంపియన్‌గా నిలిచింది. 

దోహాలో జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్‌ అనిసిమోవా 6–4, 6–3తో 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. అనిసిమోవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 2002లో మోనికా సెలెస్‌ తర్వాత ఖతర్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన రెండో అమెరికా ప్లేయర్‌గా అనిసిమోవా గుర్తింపు పొందింది. 

ఈ గెలుపుతో అనిసిమోవా నేడు విడుదలయ్యే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ 18వ ర్యాంక్‌ను అందుకుంటుంది. ఓవరాల్‌గా అనిసిమోవా కెరీర్‌లో ఇది మూడో సింగిల్స్‌ టైటిల్‌. 2019లో బొగోటా ఓపెన్‌లో, 2022లో మెల్‌బోర్న్‌ ఓపెన్‌లో ఆమె టైటిల్స్‌ సాధించింది.

 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)