అత‌డొక అద్బుతం.. చాలా క్లాస్‌గా ఆడుతున్నాడు: రాయుడు

Published on Tue, 04/22/2025 - 22:17

ఐపీఎల్-2025లో గుజ‌రాత్ టైటాన్స్ యువ ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ దుమ్ములేపుతున్నాడు. ప్ర‌తీ మ్యాచ్‌లోనూ ప‌రుగులు సాధించి గుజ‌రాత్ జైత్ర యాత్ర‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. సోమ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ సుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.

ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన సుద‌ర్శ‌న్‌.. 50 కంటే ఎక్కువ సగటుతో 417 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ఈ క్ర‌మంలో సుద‌ర్శ‌న్‌పై టీమిండియా మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. టీ 20 క్రికెట్‌ను ట్రేడిష‌న‌ల్‌గా ఎలా ఆడాలో సుద‌ర్శ‌న్ చూపిస్తున్నాడ‌ని అత‌డు కొనియాడాడు.

"సాయిసుద‌ర్శ‌న్ అద్బుతంగా ఆడుతున్నాడు. అత‌డి బ్యాటింగ్ చూసేందుకు రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదు. చాలా సంతోషంగా ఉంది. అత‌డు క్లాసిక‌ల్ బ్యాట‌ర్‌గా ఆడుతున్నాడు. క్రికెట్‌ను సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఆడవచ్చో త‌న బ్యాటింగ్‌తో చూపిస్తున్నాడు. సుద‌ర్శ‌న్‌ బంతి వేగాన్ని సరిగ్గా ఉపయోగించుకుని స్మార్ట్ క్రికెట్ ఆడుతున్నాడు.

ప్ర‌తీ మ్యాచ్‌లో ప‌రుగులు సాధించ‌డం అతడి ఆత్మ‌విశ్వాస్వాన్ని మ‌రింత రెట్టింపు చేస్తోంది. సుద‌ర్శ‌న్ అద్భుత ఫామ్ జ‌ట్టు మొత్తాన్ని ప్ర‌భావితం చేస్తోంది. అందరు ఆటగాళ్లు ఒకే లయలో ఆడతారు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ టీమ్‌లో అదే మ‌నం చూస్తున్నాము" అని జియో స్టార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.
చ‌ద‌వండి: IPL 2025: టీమిండియా క్రికెట‌ర్ మంచి మ‌న‌సు.. రూ.7 ల‌క్ష‌ల‌ ఆర్ధిక సాయం

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)