Breaking News

అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్‌ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు

Published on Fri, 08/11/2023 - 18:26

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు మరోసారి అభిమానలను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల ఆఖరిలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో  రాయుడు బరిలోకి దిగనునున్నాడు. ఈ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు  రాయుడు ప్రాతినిథ్యం వహించనున్నాడు.

తద్వారా  సీపీఎల్‌లో ఆడనున్న రెండో భారత క్రికెటర్‌గా అంబటి రికార్డులకెక్కనున్నాడు. అంతకముందు 2020 సీజన్‌లో భారత స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ తరపున సీపీఎల్‌లో ఆడాడు. అయితే బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం సీపీఎల్‌లో ఆడేందుకు రాయుడుకు అటంకం ‍కలిగే ఛాన్స్‌ ఉంది.

కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ రూల్‌ ప్రకారం.. ఇటీవల కాలంలో రిటైర్డ్‌ అయిన భారత క్రికెటర్లు ఇతర దేశాల ప్రాంఛైజీ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో భాగం కాకుడదు. ఈ నిబంధన కారణంగానే అమెరికా వేదికగా జరిగిన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టి20 టోర్నమెంట్‌లో భాగం కాలేదు.

లేదంటే ఈ ఏడాది సీజన్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టు తరపున రాయుడు ఆడాల్సింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత అన్నిఫార్మాట్‌ల క్రికెట్‌ నుంచి రాయుడు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక సెయింట్ కిట్స్ ఫ్రాంచైజీతో కుదుర్చుకోవడంపై రాయుడు స్పందించాడు.

సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్ పేట్రియాట్స్‌ జట్టుతో జత కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది సీపీఎల్‌లో సెయింట్ కిట్స్‌కు నావంతు సహకారం అందిస్తానని రాయుడు పేర్కొన్నాడు. కాగా సీపీఎల్‌-2023 సీజన్‌ ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది.
చదవం‍డి: IND vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్‌

#

Tags : 1

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)