ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టార్‌ ఓపెనర్‌.. వైస్‌ కెప్టెన్‌ ఎవరంటే?

Published on Sat, 12/09/2023 - 13:10

ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు రెగ్యూలర్‌ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ ఎంపికైంది. మూడు ఫార్మాట్లలోనూ  మేగ్ లానింగ్ వార‌సురాలిగా హేలీని నియమిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా శనివారం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఆసీస్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా త‌హ్లియా మెక్‌గ్రాత్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా మేగ్ లానింగ్ గైర్హజరీలో చాలా సిరీస్‌లలో హీలీనే ఆసీస్‌ జట్టుకు సారథ్యం వహించింది.

ఈ ఏడాది జూన్‌ నుంచి ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లలో ఆసీస్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌ హీలీ వ్యవహరించింది. ఇక ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత హీలీ స్పందించింది. ‘ఆసీస్ సార‌థిగా ఎంపికైనంద‌కు చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నా. జ‌ట్టును న‌డిపించే అవ‌కాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. గ‌త కొన్ని నెల‌లుగా జ‌ట్టు స‌భ్యులు ఎంతో స‌హ‌కారం అందించారు’ అని హేలీ తెలిపింది.

కాగా హీలీకి ఫ్రాంచైజీ క్రికెట్‌లో కూడా సారధిగా అనుభవం ఉంది. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్‌ లీగ్‌లో యూపీ వారియ‌ర్స్ జట్టుకు ఆమె సారధిగా కొనసాగుతోంది.  మహిళల బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా కొన్ని సీజన్లలో సిడ్నీ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. కాగా ఆస్ట్రేలియా పురుషల జట్టు స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ భార్యనే హీలీ అన్న సంగతి తెలిసిందే.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)