Breaking News

అల్‌కరాజ్‌ అదరహో

Published on Sat, 06/08/2024 - 04:32

పారిస్‌: కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించడానికి స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ విజయం దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అల్‌కరాజ్‌ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. వచ్చే వారం కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించనున్న ప్రస్తుత రెండో ర్యాంకర్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో అల్‌కరాజ్‌ 2–6, 6–3, 3–6, 6–4, 6–3తో గెలుపొందాడు. 

నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), గత ఏడాది రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అల్‌కరాజ్‌ తలపడతాడు. 21 ఏళ్ల అల్‌కరాజ్‌ 2022లో యూఎస్‌ ఓపెన్, 2023లో వింబుల్డన్‌ టోర్నీర్నీలో విజేతగా నిలిచాడు. అడ్రియానో పనట్టా (1976లో) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా ఘనత వహించాలనుకున్న సినెర్‌కు నిరాశ ఎదురైంది. 

4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సినెర్‌ చివరి రెండు సెట్‌లలో అల్‌కరాజ్‌ ఆటకు ఎదురునిలువలేక ఓడిపోయాడు. 8 ఏస్‌లు, 7 డబుల్‌ ఫాల్ట్‌లు చేసిన అల్‌కరాజ్‌ 65 విన్నర్స్‌తో అదరగొట్టాడు. తన సర్విస్‌ను ఆరుసార్లు కోల్పోయిన ఈ మాజీ నంబర్‌వన్‌ ప్రత్యర్థి సర్విస్‌ను కూడా ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. 15 పాసింగ్, 23 డ్రాప్‌ షాట్‌లతో అలరించిన అల్‌కరాజ్‌ నెట్‌ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు గెలిచాడు.

స్వియాటెక్‌ X జాస్మిన్‌ 
» నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్‌
» సాయంత్రం గం. 6:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంగా స్వియాటెక్‌... తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో జాస్మిన్‌ పావ్లిని... నేడు జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో తలపడనున్నారు. 

ప్రపంచ నంబర్‌వన్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను మూడుసార్లు (2020, 2022, 2023) చేజిక్కించుకోగా... 15వ ర్యాంకర్‌ జాస్మిన్‌ (ఇటలీ) మాత్రం కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతూ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)