అల్‌కరాజ్, మెద్వెదెవ్‌ ముందంజ

Published on Sat, 09/02/2023 - 02:49

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)కు రెండో రౌండ్‌లో సునాయాస విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ అల్‌కరాజ్‌ 6–3, 6–1, 7–6 (7/4)తో లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా)ను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) రెండో రౌండ్‌లో 6–2, 6–2, 6–7 (6/8), 6–2తో క్రిస్టోఫర్‌ కానెల్‌ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించాడు.

మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఆండీ ముర్రే (బ్రిటన్‌) ఆట మాత్రం రెండో రౌండ్‌లోనే ముగిసింది. గ్రిగర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6–3, 6–4, 6–1తో ముర్రేను ఇంటి ముఖం పట్టించాడు.  మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సబలెంకా (రష్యా) 6–3, 6–2తో జోడీ బురెజ్‌ (యూకే)ను...9వ సీడ్‌ వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–2తో ట్రెవిజాన్‌ (ఇటలీ)ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. 

టెన్నిస్‌ సర్క్యూట్‌లో సుదీర్ఘ మ్యాచ్‌లకు చిరునామాగా నిలిచిన జాన్‌ ఇస్నర్‌ (అమెరికా) రెండో రౌండ్‌లో మరో సుదీర్ఘ సమరంలో ఓడి ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 3 గంటల 57 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికాకే చెందిన మైకేల్‌ మో 3–6, 4–6, 7–6 (7/3), 6–4, 7–6 (10/7) స్కోరుతో ఇస్నర్‌ను ఓడించాడు. టెన్నిస్‌ చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్‌ (11 గంటల 5 నిమిషాల పాటు – నికోలస్‌ మహుత్‌తో) ఆడిన రికార్డులో ఇస్నర్‌ భాగం కాగా...అత్యధిక ఏస్‌లు (14,470) కొట్టిన ఘనత కూడా అతని సొంతం.

పురుషుల డబుల్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్ల పోరు తొలి రౌండ్‌లోనే ముగిసింది. యూకీ బాంబ్రీ (భారత్‌) – డెమోలినర్‌ (బ్రెజిల్‌) జోడి 3–6, 5–7తో హ్యూగో నిస్‌ (మొనాకో) – జిలిన్‌స్కీ (పోలాండ్‌) చేతిలో... సాకేత్‌ మైనేని (భారత్‌) – కరట్‌సెవ్‌ (రష్యా) ద్వయం 7–6 (7/4), 3–6, 2–6తో లాస్లో జెరె (సెర్బియా) – హ్యూస్టర్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడారు.    

Videos

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

నో డౌట్ పక్కా సీఎం జగన్

వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం

జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

Photos

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)