Breaking News

మనిక అవుట్‌... ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ

Published on Thu, 08/01/2024 - 04:13

పారిస్‌ ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) వ్యక్తిగత విభాగంలో భారత్‌ నుంచి ఆకుల శ్రీజ మాత్రమే బరిలో నిలిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 25వ ర్యాంకర్‌ ఆకుల శ్రీజ 9–11, 12–10, 11–4, 11–5, 10–12, 12–10తో జెంగ్‌ జియాన్‌ (సింగపూర్‌)పై విజయం సాధించింది. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజకు గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలక దశల్లో శ్రీజ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. 

ఈ గెలుపుతో మనిక బత్రా తర్వాత ఒలింపిక్స్‌ క్రీడల టీటీ పోటీల్లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా తెలంగాణ అమ్మాయి శ్రీజ గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ సన్‌ యింగ్‌షా (చైనా)తో శ్రీజ తలపడుతుంది. మరోవైపు భారత రెండో ర్యాంకర్‌ మనిక బత్రా పోరాటం విశ్వ క్రీడల్లో ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్‌ మనిక 6–11, 9–11, 14–12, 8–11, 7–11తో ప్రపంచ 13వ ర్యాంకర్‌ మియు హిరానో (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)