Breaking News

ఆకుల శ్రీజ శుభారంభం

Published on Mon, 09/29/2025 - 04:29

బీజింగ్‌: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) చైనా స్మాష్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్‌ శ్రీజ 11–6, 11–9, 11–7తో ప్రపంచ 103వ ర్యాంకర్‌ యాంగ్‌ యియున్‌ (చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజ తన సర్వీస్‌లో 15 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 18 పాయింట్లు సాధించింది. 

మరోవైపు యాంగ్‌ తన సర్వీస్‌లో 11 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 11 పాయింట్లు దక్కించుకుంది. శ్రీజ కాకుండా భారత్‌ నుంచి మెయిన్‌ ‘డ్రా’లో మనిక బత్రా మాత్రమే బరిలో ఉంది. భారత్‌కే చెందిన అహిక ముఖర్జీ, స్వస్తిక ఘోష్, దియా చిటాలె, యశస్విని ఘోర్పడే క్వాలిఫయింగ్‌ రౌండ్‌ను దాటి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు.  

మానవ్‌ బోణీ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ 42వ ర్యాంకర్‌ మానవ్‌ ఠక్కర్‌ గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్‌లో మానవ్‌ 11–5, 11–6, 11–9తో ప్రపంచ 44వ ర్యాంకర్‌ ఫిన్‌ లు (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో మానవ్‌ తన సర్వీస్‌లో 18 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 15 పాయింట్లు సంపాదించాడు. భారత్‌కే చెందిన అంకుశ్‌ భట్టాచార్య తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. 

క్వాలిఫయర్‌గా మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన అంకుర్‌ 11–3, 9–11, 10–12, 11–6, 8–11తో నికోలస్‌ లుమ్‌ (ఆ్రస్టేలియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. భారత్‌కే చెందిన సత్యన్‌ జ్ఞానశేఖరన్, పాయస్‌ జైన్, సూరావజ్జుల స్నేహిత్, హర్మీత్‌ దేశాయ్, మనుశ్‌ షా క్వాలిఫయింగ్‌ రౌండ్‌ను అధిగమించడంలో విఫలమయ్యారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)