Breaking News

ఇరానీ కప్‌.. రాణించిన రహానే, సర్ఫరాజ్‌

Published on Wed, 10/02/2024 - 09:51

లక్నో: సీనియర్‌ ఆటగాడు అజింక్యా రహానే (197 బంతుల్లో 86 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా, రంజీ చాంపియన్‌ ముంబై జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన ఇరానీక కప్‌ మ్యాచ్‌లో ముంబై సారథి రహానే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రహానేతో పాటు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌ (84 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (88 బంతుల్లో 54 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు.

ఫలితంగా టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానే చక్కటి ఇన్నింగ్స్‌ ఆడగా... ఓపెనర్‌ పృథ్వీ షా (4), ఆయుష్‌ మాత్రే (19), హార్దిక్‌ తమోర్‌ (0) విఫలమయ్యారు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 3 వికెట్లు తీయగా, యశ్‌ దయాళ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. రహానేతో పాటు సర్ఫరాజ్‌ ఖాన్‌ క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)