Breaking News

'అతడిని చూస్తే శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు.. చాలా అరుదుగా ఉంటారు'

Published on Mon, 01/09/2023 - 18:28

టీమిండియా ఎక్స్‌ప్రెస్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తన బౌలింగ్‌ స్కిల్స్‌తో అందరనీ అకట్టుకుంటున్నాడు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఉమ్రాన్‌ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో 7 వికెట్లతో ఉమ్రాన్‌ సత్తాచాటాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్‌ బౌలర్‌ కూడా ఉమ్రానే కావడం విశేషం. ఇక లంకతో సిరీస్‌లో అదరగొట్టిన ఉమ్రాన్‌పై భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత దిగ్గజ బౌలర్‌ జవగల్ శ్రీనాథ్‌తో ఉమ్రాన్‌ను జడేజా పోల్చాడు.

ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి బౌలర్‌లు చాలా అరుదగా ఉంటారు. భారత్‌లో మాత్రం చాలా కాలం తర్వాత ఉమ్రాన్‌ వంటి స్పీడ్‌ స్టార్‌ను చూశాను. గతంలో జావగల్ శ్రీనాథ్ కూడా ఈ విధమైన స్పీడ్‌తో బౌలింగ్‌ చేసేవాడు. ప్రస్తుతం మాలిక్‌ను చూస్తుంటే నాకు శ్రీనాథ్ గుర్తుస్తున్నాడు. ఉమ్రాన్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అతడి లాంటి ఆణిముత్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.

డెత్‌ ఓవర్లలో కూడా బౌలింగ్‌ చేసే సత్తా అతడికి ఉంది. ముఖ్యంగా టెయిలండర్‌లు క్రీజులో ఉన్నప్పుడు అతడిని బౌలింగ్‌కు తీసుకురండి. ఉమ్రాన్‌ స్పీడ్‌కు వాళ్లు తట్టుకోలేరు. అతడిని 10 సార్లు తీసుకువస్తే 8 సార్లు వికెట్లు తీయగలడు అని జడేజా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఉమ్రాన్‌ మాలిక్‌ లంకతో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)