Breaking News

అఫ్గానిస్తాన్‌ సంచలనాల వెనుక ఇండియన్‌ లెజెండ్‌.. ఎవరంటే?

Published on Tue, 10/24/2023 - 14:32

అఫ్గానిస్తాన్‌.. వన్డే ప్రపంచకప్‌-2023లో పెను సంచలనాలు నమోదు చేస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గాన్‌.. వరల్డ్‌క్లాస్‌ జట్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ మెగా టోర్నీలో మొన్నటికి మొన్న డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆఫ్గాన్స్‌.. ఇప్పుడు పాకిస్తాన్‌ను చిత్తు చేశారు. ధర్మశాల వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో తేడాతో ఆఫ్టానిస్తాన్‌ విజయం సాధించింది. వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం

ఈ విజయంతో అఫ్గాన్‌ తాము పసికూనలు కాదని క్రికెట్‌ ప్రపంచానికి చాటిచెప్పింది. అయితే అఫ్గాన్ చరిత్రాత్మక విజయాల వెనక భారతీయుడి పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసా? ఈ మెగా టోర్నీకి ముందు కేవలం వారం రోజుల ముందే జట్టుతో కలిసిన అతడు.. ఆఫ్గాన్‌ను పసికూనలా కాదు పులిలా తాయారు చేశాడు.

అతడో ఎవరో కాదు భారత క్రికెట్‌ దిగ్గజం అజేయ్‌ జడేజా. వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు అజేయ్‌ జడేజాను తమ జట్టు మోంటార్‌, అస్టెంట్‌ కోచ్‌గా ఆఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు నియమించింది. భారత్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న అజయ్ జడేజా సాయంతో ప్రణాళికలను సిద్దం చేసుకొని అఫ్గాన్ బరిలోకి దిగుతోంది.

జడేజా ఎంట్రీ.. అఫ్గాన్స్‌ అదుర్స్‌
జడేజా మెంటార్‌గా తన బాధ్యతలు చేపట్టనప్పటినుంచి ఆఫ్గానిస్తాన్‌ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా మిగితా అన్నింటిల్లోనూ ప్రత్యర్ధి జట్లకు గట్టిపోటి ఇచ్చింది. ఇంగ్లండ్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ జట్టుకే ఆఫ్గానిస్తాన్‌ చుక్కలు చూపించింది. రాబోయే రోజుల్లో ఆఫ్గాన్‌ జడేజా నేతృత్వంతో మరింత రాటుదేలే అవకాశం ఉంది. జడేజా తన అనుభవంతో మరిన్ని సంచలానాలు సృష్టించేలా ఆఫ్గాన్స్‌ను తాయారు చేస్తాడని క్రికెట్‌ నిపుణులు జోస్యం చెబుతున్నారు.

టీమిండియాలో పవర్‌ హిట్టర్‌..
భారత క్రికెట్‌ చరిత్రలో అజయ్ జడేజాకు పవర్‌ హిట్టర్‌గా పేరుంది. ఎన్నో మ్యాచ్‌లను జడేజా ఒంటి చేత్తో గెలిపించాడు. మూడు వరల్డ్‌కప్‌లు టోర్నీలు ఆడిన భారత జట్టులొ జడేజా సభ్యునిగా ఉన్నాడు. జడేజా తన కెరీర్‌లో 196 వన్డేలు, 15 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 576 పరుగులు చేసిన జడేజా.. వన్డేల్లో 5359 పరుగులు ఉన్నాయి. 13 వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

పాకిస్తాన్‌పై సూపర్‌ రికార్డు..
అజేయ్‌ జడేజాకు పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. పాకిస్తాన్‌ అంటే జడేజాకు పూనకలే. మొత్తంగా పాక్‌పై 40 మ్యాచ్‌లు ఆడిన అజయ్‌ 892 పరుగులు చేశాడు. బౌలర్‌గా రెండు వికెట్లు తీశాడు. తన అనుభవాన్ని ఆఫ్గాన్‌ యువ క్రికెటర్లు పంచిన అజేయ్‌.. పాకిస్తాన్‌ను చిత్తు కావడానికి పరోక్షంగా కారణమయ్యాడు.
చదవండి: చరిత్ర సృష్టించడానికే వచ్చాం.. నేను ముందే చెప్పా: అఫ్గాన్‌ కెప్టెన్‌

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)