Breaking News

'పాక్‌ కెప్టెన్‌కు కొంచెం కూడా తెలివి లేదు.. అదొక చెత్త నిర్ణయం'

Published on Sat, 02/15/2025 - 16:09

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకు ముందు పాకిస్తాన్ వేదిక‌గా జ‌రిగిన ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ టైటిల్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. శుక్ర‌వారం జ‌రిగిన క‌రాచీ వేదిక‌గా జ‌రిగిన పైన‌ల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో కివీస్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఓ ద‌శ‌లో కివీస్‌కు గ‌ట్టిపోటీ ఇచ్చిన పాక్ జట్టు.. ఆ త‌ర్వాత సొంత త‌ప్పిదాల వ‌ల్ల మ్యాచ్‌పై ప‌ట్టుకోల్పోయింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పాక్ కేవ‌లం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. 

మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కూడా బ్లాక్ క్యాప్స్ చేతిలోనే పాక్ ఓట‌మి చ‌విచూసింది. ఈ నేప‌థ్యంలో మహ్మద్ రిజ్వాన్ అండ్ కోపై  పాక్ మాజీ క్రికెటర్ అహ్మ‌ద్‌ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ ఆట తీరు ఎలా ఉందో తేటతెల్లమైందని షెహజాద్ మండిపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాక్ జ‌ట్టు  ఫీల్డింగ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచింది.

"టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవ‌డం కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ చేసిన ఘోర త‌ప్పిదంగా ప‌రిగణించాలి. నిజంగా అదొక చెత్త నిర్ణ‌యం. ఎందుకంటే ఈ వేదిక‌లో జ‌రిగిన గ‌త మ్యాచ్‌లో పిచ్‌ రాత్రిపూట బ్యాటింగ్‌కు అనుకూలించడం మనం చూశాము. తేమ ఎక్కువగా వ‌ల్ల స్పిన్న‌ర్లు కూడా పట్టు సాధించలేకపోయారు. అందువల్ల బంతి చక్కగా బ్యాట్‌పైకి వచ్చింది.

అయిన‌ప్ప‌టికి పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అస్స‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారో ఎందుకు నాకు ఆర్దం కావ‌డం లేదు. ఇదొక్క‌టే కాదు ఈ మ్యాచ్‌లో చాలా తప్పులు చేశారు. కొన్ని కొన్ని నిర్ణయాలు మరీ చైల్డీష్‌గా ఉన్నాయి. ప్రత్యర్థి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే మ‌నం విజ‌యం సాధించే అవ‌కాశ‌ముంటుంది.

అంతేకాకుండా జ‌ట్టులోని ప్ర‌ధాన ఆట‌గాళ్లు సైతం రాణించాల్సిన అవ‌సర‌ముంది. లేదంటే ఛాంపియన్స్‌ ట్రోఫీ వంటి మెగా టోర్నీలో సమస్యలు ఎదుర్కొకతప్పదు అని షెహజాద్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.

బాబర్ మళ్లీ ఫెయిల్‌.. 
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా..  సల్మాన్ అఘా(65 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 45) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

కానీ బాబర్ ఆజం మాత్రం మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 29 పరుగులు మాత్రమే చేసి ఆజం పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ ఓ రూర్కీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మైకేల్ బ్రేస్‌వెల్(2/38), మిచెల్ సాంట్నర్(2/20) తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు జాకోబ్ డఫ్ఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. 

అనంతరం 243 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలో చేధించి గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(58 బంతుల్లో 6 ఫోర్లతో 57), టామ్ లాథమ్(64 బంతుల్లో 5 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు డెవాన్ కాన్వే (74 బంతుల్లో 5 ఫోర్లతో 48) కూడా రాణించాడు.
చదవండి: ENG vs IND: రోహిత్ శ‌ర్మకు బిగ్‌ షాక్‌.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్‌ ప్లేయర్‌?

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)