Breaking News

అప్పుడు సారా.. ఇప్పుడు సచిన్‌ టెండుల్కర్‌!

Published on Tue, 01/16/2024 - 21:26

సోషల్‌ మీడియాలో డీప్‌ఫేక్‌ వీడియోలకు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు డీప్‌ఫేక్‌ బారిన పడగా.. టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కూడా తాజాగా ఆ బాధితుల జాబితాలో చేరాడు.

ఓ గేమింగ్‌ అప్లికేషన్‌ను సచిన్‌ ప్రమోట్‌ చేస్తున్నట్లుగా నకిలీ వీడియోను రూపొందించి నెట్టింట వదిలారు సైబర్‌ నేరాలకు అలవాటు పడ్డ మాయగాళ్లు. ఇది కాస్తా తన వరకు చేరడంతో.. ఎక్స్‌ వేదికగా స్పందించాడీ బ్యాటింగ్‌ లెజెండ్‌.

ఇవన్నీ నకిలీ వీడియోలు
‘‘ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని ఇంతలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది. ఇలాంటి వీడియోలు, యాడ్స్‌, అప్లికేషన్లు గనుక మీ దృష్టికి వస్తే ప్రతి ఒక్కరు తప్పక రిపోర్టు చేయండి’’ ని సచిన్‌ టెండుల్కర్‌.. తన ఫాలోవర్లకు సూచించాడు.

అదే విధంగా.. ‘‘ఇలాంటి ఫిర్యాదుల పట్ల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా వేగంగా స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలి. డీప్‌ఫేక్స్‌, తప్పు సమాచారవ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి’’ అని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్లకు విజ్ఞప్తి చేశాడు సచిన్‌ టెండుల్కర్‌.

గిల్‌తో ఉన్నట్లుగా ఫొటో మార్ఫ్‌ చేసి
కాగా సచిన్‌ టెండుల్కర్‌ కుమార్తె సారా టెండుల్కర్‌ కూడా డీప్‌ఫేక్‌ బారిన పడిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోను సృష్టించారు. తన తమ్ముడు అర్జున్‌ టెండుల్కర్‌తో సారా దిగిన ఫొటోను మార్ఫ్‌ చేసి లీక్‌ చేశారు.

అంతేకాదు ఆమె పేరిట ఫేక్‌ అకౌంట్లు సృష్టించి గిల్‌ పట్ల ప్రేమను చాటుకుంటున్నట్లుగా పోస్టులు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన సారా టెండుల్కర్‌ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్స్‌ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసింది. 

చదవండి: చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)