Breaking News

‘వీసా’ వచ్చేసింది...  రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్‌ జట్టు   

Published on Tue, 09/26/2023 - 07:13

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ఎట్టకేలకు వీసా సమస్య తీరింది. సోమవారం సాయంత్రం జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి భారత వీసాలు మంజూరైనట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ధారించింది. పాక్‌ బృందానికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది.

48 గంటల్లో భారతదేశానికి బయల్దేరాల్సి ఉన్నా... ఇంకా తమకు వీసాలు రాకపోవడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ అసంతృప్తిని వెల్లడించింది. సోమవారం ఉదయం ఈ విషయంపై పాక్‌ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. చివరకు సాయంత్రానికి పరిస్థితి చక్కబడింది.

వరల్డ్‌ కప్‌కు ముందు దుబాయ్‌లో రెండు రోజుల పాటు తమ జట్టుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావించిన పాక్‌ వీసా సమస్య కారణంగా దానిని రద్దు చేసుకుంది. ఇప్పుడు తాజా షెడ్యూల్‌ ప్రకారం బుధవారం తెల్లవారుజామున లాహోర్‌ నుంచి బయల్దేరే పాక్‌ టీమ్‌ దుబాయ్‌ మీదుగా సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకుంటుంది. శుక్రవారం ఆ జట్టు ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వామప్‌ మ్యాచ్‌ ఆడుతుంది.
చదవండి: IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)