Breaking News

పాక్‌ క్రికెట్‌కు భారీ షాక్‌.. 24 గంటల్లోనే ఇద్ద‌రి స్టార్ ప్లేయ‌ర్ల రిటైర్మెంట్‌

Published on Sat, 12/14/2024 - 16:37

పాకిస్తాన్ క్రికెట్‌కు 24 గంట‌లు తిరగ‌కముందే మ‌రో భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్‌ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ శనివారం (డిసెంబర్ 14) అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అమీర్ వెల్లండిచాడు.

"అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాను. చాలా ఆలోచించిన త‌ర్వాత ఈ క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకున్నాను. రాబోయో త‌రానికి అవ‌కాశ‌మిచ్చేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్‌కు మూడు ఫార్మాట్ల‌లో ప్రాతినిథ్యం వ‌హించడం నాకు ద‌క్కిన  గొప్ప గౌరవం.

తన ప్రయాణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు"అని రిటైర్మెంట్ నోట్‌లో అమీర్ పేర్కొన్నాడు.కాగా అమీర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం ఇది రెండో సారి. బోర్డుతో విబేధాలు కార‌ణంగా 2020లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన అమీర్‌.. మ‌ళ్లీ ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడేందుకు త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. 

పాక్ త‌ర‌పున అమీర్ తన కెరీర్‌లో  36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఓవ‌రాల్‌గా 158 మ్యాచ్‌లు ఆడిన అమీర్‌.. 271 వికెట్ల పాటు 1,179 పరుగులు చేశాడు.  ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున అమీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అమీర్ కీల‌క పాత్ర పోషించాడు. 

కాగా మరో పాక్‌ ఆటగాడు ఇమాద్‌ వసీం రిటైర్మెంట్‌ ప్రకటించిన 24 గంటల తర్వాత అమీర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిద్దరూ ఫ్రాంచైజీ క్రికెట్‌లో బిజీబిజీగా ఉన్నారు.
చదవండి: IND vs AUS: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచం‍లోనే రెండో ప్లేయర్‌గా

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)