Breaking News

ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌.. పాకిస్తాన్‌ గెలవడం కష్టమే! ఒక వేళ అది జరిగితే

Published on Sat, 10/21/2023 - 17:42

వన్డే ప్రపంచకప్‌-2203లో వరుసగా రెండు ఓ‍టములు చవిచూసిన పాకిస్తాన్‌.. ఇప్పుడు మరో ఆసియా జట్టుతో తలపడేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్‌ 23న చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో పాక్‌ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని బాబర్‌ సేన భావిస్తోంది.

మరోవైపు ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కే షాకిచ్చిన ఆఫ్గాన్‌.. పాకిస్తాన్‌ను కూడా మట్టి కరిపించాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు రమీజ్‌ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెపాక్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కంటే ఆఫ్గానిస్తాన్‌ కాస్త ఫేవరెట్‌గా కన్పిస్తోంది అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు.

"పాకిస్తాన్‌ తిరిగి కోలుకోవడం చాలా కష్టం. చెన్నైలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఎదైనా జరగవచ్చు. ఆఫ్గానిస్తాన్‌ స్పిన్నర్లను మా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి. ఒక వేళ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తే పాకిస్తాన్‌పై ఆఫ్గాన్‌ కచ్చితంగా పై చేయి సాధిస్తుంది. అదే వికెట్‌పై ఇంగ్లండ్‌పై ఆఫ్గాన్‌ ఏమి చేసిందే మనం చూశామని" తన యూట్యూబ్‌ ఛానల్‌లో  రమీజ్‌ రజా పేర్కొన్నాడు.

కాగా అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఇరు జట్లు ముఖాముఖి 7 సార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ పాకిస్తానే విజయం సాధించింది. అయితే చాలాసార్లు మాత్రం పాకిస్తాన్‌కు ఆఫ్గాన్‌ గట్టిపోటీ ఇచ్చింది.
చదవండి: IND vs NZ WC 2023: టీమిండియాతో మ్యాచ్‌.. న్యూజిలాండ్‌కు గుడ్‌ న్యూస్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)