Breaking News

ఏఎఫ్‌సీ మహిళల చాంపియన్స్‌ లీగ్‌కు ఈస్ట్‌ బెంగాల్‌ క్లబ్‌ అర్హత 

Published on Mon, 09/01/2025 - 06:36

దేశవాళీ ఫుట్‌బాల్‌లో మేటి జట్టు ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మరో ఘనతను సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) మహిళల చాంపియన్స్‌ లీగ్‌ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భారత మహిళల లీగ్‌ చాంపియన్‌ హోదాలో ఆసియా చాంపియన్స్‌ లీగ్‌ ప్రిలిమినరీ టోర్నీలో ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. కంబోడియాలో జరిగిన ఈ టోర్నీలో గ్రూప్‌ ‘ఇ’లో బరిలోకి దిగిన ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు నాలుగు పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌లో నిలిచి ముందంజ వేసింది. 

కిచీ స్పోర్ట్స్‌ క్లబ్‌ (హాంకాంగ్‌)తో ఆదివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఈస్ట్‌ బెంగాల్‌ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఈస్ట్‌ బెంగాల్‌ తరఫున సంగీత (11వ నిమిషంలో), కిచీ స్పోర్ట్స్‌ క్లబ్‌ తరఫున హో ముయ్‌ మె (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. తొలి మ్యాచ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ 1–0తో ఫొనోమ్‌ పెన్‌ క్రౌన్‌ (కంబోడియా)పై గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గోల్‌ చేయకపోయినా... తెలంగాణ అమ్మాయి, భారత జట్టు ఫార్వర్డ్‌ సౌమ్య గుగులోత్‌ ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. గత సీజన్‌కుగాను భారత ‘ఉత్తమ మహిళా ఫుట్‌బాలర్‌’గా ఎంపికైన సౌమ్య దూకుడుగా ఆడి తమ జట్టుకు గోల్‌ అవకాశాలను సృష్టించింది. ఆసియాలోని 12 క్లబ్‌ జట్లు పోటీపడే చాంపియన్స్‌ లీగ్‌ అక్టోబర్‌ నుంచి వచ్చే ఏడాది మే వరకు మూడు అంచెల్లో జరుగుతుంది.    

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)