Breaking News

మరీ ఇంత బద్దకమా? క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్‌.. వీడియో వైరల్‌

Published on Fri, 10/27/2023 - 15:18

వన్డే ప్రపంచకప్‌-2023లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో మరో ఘోర ఓటమిని ఇంగ్లండ్‌ చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను శ్రీలంక చిత్తు చేసింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్‌ స్టోక్స్‌(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

 లంక బ్యాటర్లలో నిస్సాంక(77 నాటౌట్‌), సమరవిక్రమ(65 నాటౌట్‌) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక లంక చేతిలో ఓటమిపాలైన ఇంగ్లీష్‌ జట్టు తమ సెమీస్‌ అవకాశాలను గల్లంతు చేసుకుంది. ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది.

రషీద్‌ చెత్త రనౌట్‌..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు అదిల్‌ రషీద్‌ విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్‌లో ఆఖరి బంతిని మహేష్‌ థీక్షణ వైడ్‌గా సంధించాడు. అయితే వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలో  నాన్‌స్ట్రైక్‌లో ఉన్న  అదిల్‌ రషీద్‌ కాస్త క్రీజును వదిలి బయటకు వచ్చాడు. ​ సరిగ్గా ఇక్కడే మెండీస్‌ తన తెలివితేటలను ఉపయోగించాడు.

అదిల్‌ రషీద్‌ క్రీజు బయట ఉండడం గమనించిన మెండీస్‌..  బంతని  నాన్‌స్ట్రైక్‌ వైపు త్రో చేసి స్టంప్స్‌ను గిరాటేశాడు. కాగా మెండిస్‌ తన గ్లోవ్‌ తీసి మరి త్రో చేశాడు. అంతసమయం ఉన్నప్పటికీ రషీద్ నెమ్మదిగా వెనుక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు.

బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి రషీద్‌ క్రీజుకు కాస్త దూరంలో ఉన్నాడు. దీంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.  క్రీజులో బద్దకంగా వ్యవహరించిన రషీద్‌ భారీ మూల్యం చెల్లించకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.
చదవండి: WC 2023: పొరపాటు చేయలేదు.. అయినా గర్వపడుతున్నాం.. మాది చెత్త టీమ్‌ కాదు: బట్లర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)