Breaking News

ఐపీఎల్‌: ఆ ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్‌.. ఆ ముగ్గురి ఆటగాళ్లకు లైన్‌ క్లియర్‌

Published on Tue, 01/09/2024 - 14:43

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు అఫ్గానిస్తాన్‌ త్రయం  ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్‌లకు ఊరట లభించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గోనేందుకు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కొన్ని షరుతులతో కూడిన నో-అబ్జెక్షన్స్ సర్టిఫికేట్‌లను (NOC) మంజూరు చేసింది. కాగా గత నెలలలో జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ ముగ్గరిపై అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ కొన్ని ఆంక్షలు విధించింది.

విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. ముగ్గురి సెంట్రల్‌ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు వీరి ముగ్గురు అంగీకరించడంతో అఫ్గాన్‌ క్రికెట్‌  తమ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుంది.

కాగా ఐపీఎల్‌-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్‌ చేసుకుంది. 2023 సీజన్‌లో నవీన్‌.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అదే విధంగా  ఫజల్‌హక్‌ ఫారూకీని ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్‌ చేసుకుంది. వీరిద్దరితో పాటు ఐపీఎల్‌-2024 మినీ వేలంలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ను కేకేఆర్‌.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది.
చదవండి: T20 WC:రోహిత్‌, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ!

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)