Breaking News

మెగా వేలానికి ముందు విధ్వంసం సృష్టించిన డుప్లెసిస్‌

Published on Mon, 11/25/2024 - 10:46

ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ విధ్వంసం సృష్టించాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా చెన్నై బ్రేవ్‌ జాగ్వర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్‌ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఫాఫ్‌ 26 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. ఫలితంగా ఫాఫ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మోరిస్‌విల్లే సాంప్‌ ఆర్మీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై బ్రేవ్‌ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డాన్‌ లారెన్స్‌ 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. చెన్నై బ్రేవ్‌ ఇన్నింగ్స్‌లో వాన్‌ డర్‌ డస్సెన్‌ 3, జోష్‌ బ్రౌన్‌ 13, భానుక రాజపక్ష 18, తిసార పెరీరా 8, క్రిస్‌ లిన్‌ 3, కోబ్‌ హెర్ఫ్ట్‌ 1 పరుగు చేశారు. సాంప్‌ ఆర్మీ బౌలర్లలో ఇమాద్‌ వసీం​, ఆమిర్‌ హమ్జా, ఉడాన, కరీమ్‌ జనత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్‌ ఆర్మీ.. ఫాఫ్‌ చెలరేగిపోవడంతో మరో 18 బంతులు మిగిలుండగానే (వికెట్‌ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సాంప్‌ ఆర్మీ ఇన్నింగ్స్‌లో షర్జీల్‌ ఖాన్‌ 8, చరిత్‌ అసలంక 17 పరుగులు చేశారు. చెన్నై బ్రేవ్‌ బౌలర్లలో ఒషేన్‌ థామస్‌కు ఓ వికెట్‌ దక్కింది. 

కాగా, ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఇవాళ (నవంబర్‌ 25) ఆక్షన్‌కు రానున్నాడు. ఫాఫ్‌ 2 కోట్ల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌ నేపథ్యంలో ఫాఫ్‌ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఫాఫ్‌ కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడవచ్చు. 
 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు