ఫైనల్లో అభినాశ్‌

Published on Sun, 04/06/2025 - 04:05

న్యూఢిల్లీ: వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్‌ అభినాశ్‌ జమ్వాల్‌ (65 కేజీలు) పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. బ్రెజిల్‌లోని ఫాజ్‌ డు ఇగాకు నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అభినాశ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో అభినాశ్‌ 5–0తో ఇటలీ బాక్సర్‌ మలంగపై ఏకపక్ష విజయం సాధించాడు. 22 ఏళ్ల అభినాశ్‌... ఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన యూరీ రెయిస్‌తో తలపడతాడు. ఐదుగురు జడ్జీల్లో నలుగురు జమ్వాల్‌కు ‘పర్‌ఫెక్ట్‌ 30’ పాయింట్లు ఇచ్చారు. 

మొదటి, మూడో రౌండ్‌లో అందరూ ఏకగ్రీవంగా అతనికే పాయింట్లు అందించడం విశేషం. మరో సెమీఫైనల్లో మనీశ్‌ రాథోడ్‌ ఓటమి పాలై కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 55 కేజీల సెమీస్‌లో మనీశ్‌ 0–5తో నూర్‌సుల్తాన్‌ అల్టిన్‌బెక్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడాడు. ఈ టోర్నీలో భారత బాక్సర్‌ హితేశ్‌ (70 కేజీలు) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా... జాదూమణి సింగ్‌ (50 కేజీలు), విశాల్‌ (90 కేజీలు), సచిన్‌ సివాచ్‌ (60 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. 

19 దేశాలకు చెందిన 130 మంది బాక్సర్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో... భారత్‌ నుంచి 10 మంది బరిలోకి దిగారు. అందులో నలుగురు బాక్సర్లు ఆరంభ రౌండ్లలోనే ఓడిపోగా... మరో నలుగురు కాంస్య పతకాలు సాధించారు.  

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)