Breaking News

గాయాలు,శస్త్ర చికిత్సలు దాటి...

Published on Sun, 11/30/2025 - 02:58

సాక్షి క్రీడా విభాగం: పదేళ్ల క్రితం అభిషేక్‌ రెడ్డి 21 ఏళ్ల వయసులో కెరీర్‌లో తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు. కర్ణాటక జట్టు తరఫున అతను అరంగేట్రం చేశాడు. రాబిన్‌ ఉతప్ప, మయాంక్‌ అగర్వాల్, మనీశ్‌ పాండే, కరుణ్‌ నాయర్‌లాంటి స్టార్‌ బ్యాటర్లు ఉన్న టీమ్‌లోకి అడుగు పెట్టి మొదటి ఇన్నింగ్స్‌లోనే అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతని ఆటను చూసిన వారంతా మంచి భవిష్యత్తు ఉందంటూ ప్రశంసించారు. కానీ దురదృష్టవశాత్తూ దశాబ్దం తర్వాత కూడా అభిషేక్‌ 25 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లే ఆడగలిగాడు. 

రెండు పెద్ద గాయాలు అతని కెరీర్‌ను దెబ్బ తీశాయి. ఇటీవల జార్ఖండ్‌పై చేసిన 247 పరుగుల ఇన్నింగ్స్‌తో అభిషేక్‌ మళ్లీ అందరి దృష్టిలో పడ్డాడు. రెండు శస్త్ర చికిత్సలు, ఎన్నో ఏళ్లు మంచానికి పరిమితం కావడంవంటివి లేకపోతే తాను పెద్ద స్థాయి చేరేవాడినని అతను తన కెరీర్‌ను విశ్లేషించుకున్నాడు. అయితే క్రికెట్‌ ఆడితే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించినా... మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టడమే తాను సాధించిన పెద్ద విజయమని అభిషేక్‌ చెప్పాడు.  

కర్ణాటక తరఫున రాణించి... 
కర్ణాటక రంజీ ట్రోఫీ గెలిచిన 2014–15 సీజన్‌లో అభిషేక్‌ భాగంగా ఉన్నాడు. అయితే కెరీర్‌ మొదలైన తర్వాతి ఏడాదికే 2016లో అభిషేక్‌ మోకాలికి మైదానంలోనే తీవ్ర గాయమైంది. దాంతో ఆటకు దూరం కావాల్సి వచి్చంది. శస్త్రచికిత్స తర్వాత కోలుకొని దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ముఖ్యంగా సీకే నాయుడు ట్రోఫీ (అండర్‌–23)లో వరుసగా నాలుగు సెంచరీలతో అతను చెలరేగాడు. ఫలితంగా కర్ణాటక రంజీ టీమ్‌లో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి.  

ఆంధ్రకు మారి... 
కర్ణాటకలోని బీదర్‌లో పుట్టిన అభిషేక్‌ జూనియర్‌ స్థాయి క్రికెట్‌ అంతా అదే రాష్ట్రం తరఫున ఆడి ఆ తర్వాత సీనియర్‌ స్థాయికి ప్రమోట్‌ అయ్యాడు. అయితే దేశవాళీలో మరింత మెరుగైన అవకాశాల కోసం జట్టు మారాలని అతను భావించాడు. తల్లి ఆంధ్రప్రదేశ్‌కు చెందింది కావడంతో అదే జట్టును అభిషేక్‌ ఎంచుకున్నాడు. 

ఆ తర్వాత మరింత మెరుగ్గా ఆడిన అభిషేక్‌ ఇప్పుడు ఆంధ్ర టీమ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే ఈ క్రమంలో 2023లో మ్యాచ్‌లో పరుగు తీస్తుండగా గాయపడటం మళ్లీ అతడి కెరీర్‌ను వెనక్కి తోసింది. సర్జరీ సమయంలో క్రికెట్‌ను వదిలేయాలని అనుకున్నానని, అయితే చివరకు మళ్లీ ఆడేందుకు పట్టుదలగా సిద్ధమైనట్లు అతను చెప్పాడు. 

గాయాలతో కోలుకుంటున్న సమయంలో ‘నీ కలల సాధనకు ప్రయత్నించు. అవి కచ్చితంగా నిజమవుతాయి’ అని రాసి ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ పోస్టర్‌ తనలో ఇన్నేళ్లుగా స్ఫూర్తి నింపుతోందని అభిషేక్‌ వెల్లడించాడు. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో అతను మరోసారి సత్తా చాటి తన కలలను నిజం చేసుకునే ప్రయత్నం చేస్తుండటం విశేషం. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)